AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care : వైట్‌ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..! అయితే ఈ చిట్కాలను పాటించండి.. చక్కటి రూపం మీ సొంతం..

Skin Care : జిడ్డుగల చర్మంగలవారు ఎక్కువగా వైట్ హెడ్స్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దుమ్ము, ధూళి, డెడ్‌ స్కిన్, ఆయిల్‌ మొదలైనవి పేరుకుపోయినప్పుడు

Skin Care : వైట్‌ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..! అయితే ఈ చిట్కాలను పాటించండి.. చక్కటి రూపం మీ సొంతం..
Skin Care
uppula Raju
| Edited By: |

Updated on: Jul 25, 2021 | 4:52 PM

Share

Skin Care:జిడ్డుగల చర్మంగలవారు ఎక్కువగా వైట్ హెడ్స్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దుమ్ము, ధూళి, డెడ్‌ స్కిన్, ఆయిల్‌ మొదలైనవి పేరుకుపోయినప్పుడు చర్మ రంధ్రాలు మూసుకుపోయి వైట్‌హెడ్స్ కనిపిస్తాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏవైనా చర్మ రంధ్రాలు మూసుకోవడం వల్ల ఏర్పడతాయి. వైట్‌హెడ్స్‌కు చికిత్స చేయడానికి అనేక సహజ మార్గాలు ఉన్నాయి. ఇంటి వద్ద ఈ చిట్కాలను పాటించి చక్కని రూపం సొంతం చేసుకోవచ్చు.

1. బేకింగ్ సోడా మరియు నీరు – ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకొని దానికి కొద్దిగా నీరు వేసి పేస్ట్ తయారు చేసుకోండి. దీన్ని ముఖం మీద అప్లై చేసి వృత్తాకార కదలికలో వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయండి. 5-10 నిమిషాలు చర్మంపై వదిలేసి ఆపై మంచినీటితో కడగండి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయండి. వైట్‌హెడ్స్‌ మాయమవుతాయి.

2. నిమ్మరసం, దాల్చినచెక్క పొడి – ఒక గిన్నెలో రెండు చెంచాల నిమ్మరసం, చెంచా దాల్చినచెక్క తీసుకోండి. వాటిని బాగా కలపడం ద్వారా పేస్ట్‌లా తయారు చేసుకోండి. వైట్‌హెడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయండి. కొన్ని నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆపై సాదా నీటితో కడగండి. వైట్‌హెడ్స్‌ను తొలగించుకోవడానికి వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేయవచ్చు.

3. స్ట్రాబెర్రీ, బియ్యం పిండి – 1-2 తాజా స్ట్రాబెర్రీలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్ట్రాబెర్రీ గుజ్జును కలపడం ద్వారా పేస్ట్‌లా తయారచేయండి. దీనికి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి కలపాలి. తర్వాత ముఖంపై అప్లై చేయండి. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి. 5-8 నిమిషాలు చర్మంపై ఆరనివ్వండి. తర్వాత కడిగేయండి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ప్రక్రియను పునరావృతం చేయండి.

4. టీ ట్రీ ఆయిల్, గంధపు పొడి – ఒక టీస్పూన్ గంధపుపొడిని కొద్దిగా నీటితో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోండి . దీనికి టీ ట్రీ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. మెత్తగా మసాజ్ చేయండి. కొన్ని నిమిషాలు వదిలేయండి. తరువాత నీటితో కడగండి. వైట్‌హెడ్స్‌ను తొలగించుకోవడానికి వారానికి రెండు, మూడు సార్లు పునరావృతం చేయవచ్చు.

Kerala Fish Molee Curry: కేరళ స్టైల్ లో కొబ్బరి పాలతో రుచికరమైన చేపల కూర తయారీ విధానం..

Weight Loss: మీరు స్లిమ్ లా అవ్వాలనుకుంటున్నారా అయితే రాత్రి 7 గంటల తరువాత ఈ పనులు చేయకండి

Health Tips : ఆల్కహాల్‌తో ఈ 5 ఆహార పదార్థాలు అస్సలు తినవద్దు..! చాలా డేంజర్..