AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: మీరు స్లిమ్ లా అవ్వాలనుకుంటున్నారా అయితే రాత్రి 7 గంటల తరువాత ఈ పనులు చేయకండి

Weight Loss: మనం తినే ఆహారం, శారీరక శ్రమ తగినంత లేకపోవడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఊబకాయులుగా తయారవుతున్నాం. దీంతో అనేక అనారోగ్యాల..

Weight Loss:  మీరు స్లిమ్ లా అవ్వాలనుకుంటున్నారా అయితే రాత్రి 7 గంటల తరువాత ఈ పనులు చేయకండి
Weight Loss
Surya Kala
|

Updated on: Jul 24, 2021 | 9:45 PM

Share

Weight Loss: మనం తినే ఆహారం, శారీరక శ్రమ తగినంత లేకపోవడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఊబకాయులుగా తయారవుతున్నాం. దీంతో అనేక అనారోగ్యాల బారిన కూడా పడుతున్నాం.. అయితే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా ఈ పనులను చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1. రాత్రి 7 గంటల తర్వాత ఖచ్చితంగా తినడం, తాగడం ఆపండి

సాయంత్రం అయ్యేకొలదీ మనం తినే ఆహారం శరీరానికి శక్తినివ్వదు. అది కొవ్వుగా మారిపోతుంది. కనుకనే పెద్దలు ఉదయాన్ని తినే అల్పాహారం మహరాజులా భారీగా తినాలని.. మధ్యాహ్నం తినే ఆహారం భోగిలా తక్కువ మొత్తంలో శక్తినిచ్చేది తినాలని.. రాత్రి తినే ఆహారం రోగిలా అతి తక్కువగా తినాలని చెప్పారు. కనుక సాయంత్రం 7 దాటితే వంటగది , నాలుకకు రెండింటికి లాక్ చేయాలి. రాత్రి 7 తర్వాత ఆహారం తినకూడదు.

2. పిండి పదార్థాలు , ప్రోటీన్ లేని ఫుడ్ ని రాత్రి ఆహారంగా తీసుకోవాలి

రాత్రి తినే విందులో కార్బోహైడ్రేట్ అధికంగా ఆహారాన్ని తింటే.. కొవ్వు వస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉన్న వాటిని తింటే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అందువల్ల పిండి పదార్థాలు , ప్రోటీన్ ఉన్న పదార్ధాలను తప్పించాలి. తేలికపాటి పండ్లు, కూరగాయలు మాత్రమే రాత్రి విందులో తినాలి.

3. నిద్రపోయే ముందు టీ, కాఫీ లను తాగకూడదు

రాత్రి 7 గంటలకు భోజనం తీసుకున్న తరువాత, టీ, కాఫీలకు బై చెప్పండి. రాత్రి టీ, కాఫీ ఆరోగ్యానికి హానికరం. ఇవి నిద్రతో పాటు జీవక్రియలపై కూడా ప్రభావం చూపిస్తాయి.

4. రాత్రి భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేయరాదు

రాత్రి భోజనం ముగిసిన అనంతరం వ్యాయామం చేయకూడదు. రాత్రి వ్యాయామం చేసే అది ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. కొన్ని సార్లు రాత్రి విందు తర్వాత చేసే వ్యాయామం హానిని కలిగిస్తుంది.

5. నిద్రపోయే ముందు ఎక్కువ నీరు తాగవద్దు

రోజంతా నీరు ఎక్కువ తాగడం మంచిది.. కానీ రాత్రి మాత్రం నీరు తీసుకోవడం తగ్గించాలి. రాత్రి ఎక్కువగా నీరు తాగితే నిద్రపై ప్రభావం చూపిస్తుంది. రాత్రి శరీరం విశ్రాంతి తీసుకునే సమయం.. అప్పుడు నీరు తాగితే.. జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది జీవక్రియ సరిగా పనిచేయదు.

6. తగినంత నిద్ర లేకపోయినా స్థూలకాయం పెరుగుతుంది

మన ఆరోగ్యంలో 50 శాతానికి పైగా ఒకే ఒక్క విషయం మీద ఆధారపడి ఉంటుంది. అదే సుఖ నిద్ర. తగినంత నిద్ర లేకపోతే శరీరం బరువు పెరుగుతుంది. అందువల్ల రాత్రి కనీసం ఏడు గంటల పాటు అయినా తప్పని సరిగా నిద్రపోవాల్సి ఉంది.

Also Read: Mahadev Mandir: ఈ ఆలయంలో అన్నీ వింతలే.. ఇక్కడ లింగాన్ని తెల్లవారు జామునే విభీషణుడు పూజిస్తారట…