Goa Tourism New Rules: గోవా టూర్‌కు వెళ్తున్నారా? ఈ నిబంధనల గురించి తెలుసుకోండి…

గోవా... ఎక్కువగా పర్యాటకులను ఆకర్శించే ప్రాంతం. ఇక్కడకు ఒక్కసారైన వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. విదేశీయులు

Goa Tourism New Rules: గోవా టూర్‌కు వెళ్తున్నారా? ఈ నిబంధనల గురించి తెలుసుకోండి...
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 07, 2021 | 1:31 PM

గోవా… ఎక్కువగా పర్యాటకులను ఆకర్శించే ప్రాంతం. ఇక్కడకు ఒక్కసారైన వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. విదేశీయులు సైతం గోవా చూడాలని.. ఒక్కరోజైనా స్టే చేయాలనుకుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రపంచ పర్యాటకంలో గోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సుందరమైన గమ్యస్థానాన్ని సందర్శించాలనుకునే వారు ముందుగా అక్కడి పర్యాటక ప్రదేశాల గురించి ఆరా తీస్తుంటారు. అలాగే ప్రస్తుతం పరిస్థితులలో గోవాలో కరోనా నిబంధనలు అమలు చేసింది అక్కడి ప్రభుత్వం.

101

రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు కొత్త SOPలు, RT-PCR నెగిటివ్ రిపోర్ట్స్ తప్పనిసరిగా ఉండాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. సముద్ర తీర ప్రాంతానికి వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష రిజల్ట్ చూపించాలని అలాగే ఫస్ట్, సెకండ్ డోసు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ కూడా తమ వెంట ఉండాలని స్పష్టం చేశారు.

Goa

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివిటీ రేటు 1.8 రేటు నుంచి 2 శాతంగా ఉంది. గోవాకు వచ్చే పర్యాటకులు కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేదా.. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రమోద్ కోవిడ్ టూరిజం నియమ నిబంధనలు వెల్లడించారు.

0101

ఇదిలా ఉంటే.. గోవాలో కొత్తగా 97 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,71,705 కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 133 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. రికవరీల సంఖ్య 1,67,556 కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 3,157కి పెరిగింది. ప్రస్తుతం గోవాలో 992 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‏లో పిచ్చ ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టండి!

Kajol: స్టార్ హీరోయిన్ అయితే ఇంత పొగరా ? కాజోల్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు…

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలలో ట్విస్ట్.. అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..

Ban Netflix: కొంపముంచిన మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్.. నెట్‏ఫ్లిక్స్ బ్యాన్ చేయాలంటూ నెట్టింట్లో రచ్చ..