IRCTC Tour: ద్వారక, సోమనాథ్ లను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించిన IRCTC

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీతో సౌరాష్ట్ర మొత్తం ఏడు రోజులు పర్యటన సాగనుంది. అంటే ఆరు రాత్రులు.. ఏడు పగళ్లుగా ఈ టూర్ కొనసాగనుంది. సుదీర్ఘ పర్యటన అక్టోబర్ 29 నుండి ప్రారంభమవుతుంది.

IRCTC Tour: ద్వారక, సోమనాథ్ లను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా?  ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించిన IRCTC
Irctc Tour Package
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2022 | 12:42 PM

IRCTC Tour Pack: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో రానున్న దేవీ నవరాత్రులకు గుజరాత్ త్వరలో వధువులా అలంకరించబడుతుంది. ఆ సమయంలో రాష్ట్రాన్ని సందర్శించడం ఖచ్చితంగా కళ్లకు మంచి ట్రీట్ అవుతుంది. గుజరాత్ లో ఘనంగా నవరాత్రి వేడుకలు మాత్రమే కాదు.. మరొక పర్యాటక కేంద్రం ఆకర్షణ ఉంది.  ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం .. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ప్రయాణీకుల సౌకర్యార్థం, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గుజరాత్‌కు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రధాన నగరాలు,  పర్యాటక కేంద్రాలను కవర్ చేస్తుంది. ‘సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీ’తో ప్రయాణికులు ఇతర ప్రదేశాలతో పాటు అద్భుతమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని కూడా సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ని IRCTC ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. “స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీతో IRCTC సౌరాష్ట్రతో సోమనాథ్, ద్వారక, రాజ్‌కోట్ తదితర పర్యాటక ప్రాంతాలను వీక్షించాలనుకునే వారికీ ఈ ప్యాకేజీ మంచి ఎంపిక

IRCTC అందిస్తోన్న గుజరాత్ టూర్ ప్యాకేజీ వ్యవధి 6 రాత్రులు 7 రోజులు. అక్టోబరు 29న హైదరాబాద్ నుండి పర్యటన ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ బుకింగ్ మొదట చేసుకున్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఇవి కూడా చదవండి

స్టాట్యూ ఆఫ్ యూనిటీ IRCTC టూర్ ప్యాకేజీతో సౌరాష్ట్ర గురించి పూర్తి వివరాలు మీ కోసం

గుజరాత్  అద్భుతమైన కోటలు, పుణ్యక్షేత్రాలు, రాజభవనాలకు ప్రసిద్ధి చెందింది. ఈ IRCTC టూర్ ప్యాకేజీ పర్యాటకులకు గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తుంది. సంస్కృతికి చిహ్నాలైన సోమనాథ్, ద్వారక, రాజ్‌కోట్, వడోదర వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

పర్యటన కాలం:

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీతో సౌరాష్ట్ర మొత్తం ఏడు రోజులు పర్యటన సాగనుంది. అంటే ఆరు రాత్రులు.. ఏడు పగళ్లుగా ఈ టూర్ కొనసాగనుంది. సుదీర్ఘ పర్యటన అక్టోబర్ 29 నుండి ప్రారంభమవుతుంది.

పర్యటన ఖర్చు:

విమాన టిక్కెట్లు (హైదరాబాద్-అహ్మదాబాద్/వడోదర-హైదరాబాద్), 1 రాత్రి అహ్మదాబాద్‌లో, 1 రాత్రి సోమనాథ్‌లో, 1 రాత్రి ద్వారకలో, 1 రాత్రి రాజ్‌కోట్‌లో, 2 రాత్రులు వడోదరలో బస చేయాల్సి ఉంటుంది. ఏడు రోజులు ప్రయాణీకులకు ఉదయం అల్పాహారం ఆరు రోజులు రాత్రి భోజనం అందించనున్నారు. ప్రయాణ ప్రణాళిక ప్రకారం సందర్శన కోసం AC బస్సు ఏర్పాటు చేస్తారు. ప్రయాణపు భీమా సౌకర్యం కల్పించనున్నారు. పర్యటన సమయంలో IRCTC టూర్ ఎస్కార్ట్ సేవలు అందుబాటులో ఉండనున్నారు.

ఆసక్తి ఉన్న ప్రయాణీకులు మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు..  బుకింగ్‌ల కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..