AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BP Control Tips: బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలా.. వీటిని ఖచ్చితంగా ఫాలో చేయండి!

ప్రస్తుతం ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో హైబీపీ కూడా ఒకటి. తినే ఆహారపు అలవాట్లు, మారిన జీవన విధానం కారణంగా చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. జీవితంలో ఒక్కసారి బీపీ వచ్చిందంటే.. మళ్లీ తగ్గడం చాలా కష్టం. ఉన్నంత కాలం కంట్రోల్ చేసుకోవడమే. హైబీపీ కారణంగా గుండె, మూత్ర పిండాలు, లివర్, మెదుడు వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. బీపీని స్లో పాయిజన్ అని వైద్యులు చెబుతూ ఉంటారు. బీపీ వస్తున్నట్టు కూడా శరీరంలో ఎలాంటి..

BP Control Tips: బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలా.. వీటిని ఖచ్చితంగా ఫాలో చేయండి!
World Hypertension Day 2024
Chinni Enni
|

Updated on: Mar 06, 2024 | 1:02 PM

Share

ప్రస్తుతం ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో హైబీపీ కూడా ఒకటి. తినే ఆహారపు అలవాట్లు, మారిన జీవన విధానం కారణంగా చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. జీవితంలో ఒక్కసారి బీపీ వచ్చిందంటే.. మళ్లీ తగ్గడం చాలా కష్టం. ఉన్నంత కాలం కంట్రోల్ చేసుకోవడమే. హైబీపీ కారణంగా గుండె, మూత్ర పిండాలు, లివర్, మెదుడు వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. బీపీని స్లో పాయిజన్ అని వైద్యులు చెబుతూ ఉంటారు. బీపీ వస్తున్నట్టు కూడా శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తినే ఆహార పదార్థాలతోనే మీరు బీపీనీ అదుపు చేసుకోవాలి.

మసాలా ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి:

బీపీ ఉన్నవాళ్లు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. మసాలాలు ఉన్న ఆహారాలు అస్సలు తినడకూడదు. ఇవి తినడం వల్ల బీపీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా గుండెల్లో మంటతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ తర్వాత కంట్రోల్ చేయడం చాలా కష్టం.

ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి:

బీపీ ఉన్నవాళ్లు మీ ఆహారంలో ఆకు కూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. రక్త పోటును అదుపు చేయడంలో ఆకు కూరలు చక్కగా పని చేస్తాయి. ముఖ్యంగా పాలకూర, తోట కూర తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పొటాషియం ఉండే ఆహారాలు తీసుకుంటే.. రక్త పోటును త్వరగా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ ఒక టమాటా తినండి:

టమాటాలు కూడా బీపీని కంట్రోల్ చేయడానికి చక్కగా ఉపయోగ పడతాయి. బీపీ ఉన్నవారు ప్రతి రోజూ ఉదయం ఒక టమాటా తింటే.. బీపీ అదుపులో ఉంటాయి. టమాటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్త పోటును ఎదుర్కోవడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది.

చేపలు తినండి:

బీపీ ఉండే వారు మంసాహారానికి బదులు చేపలు తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి రక్త పోటును తగ్గించడంలో చక్కగా ఉపయోగ పడతాయి. అంతే కాకుండా ట్రై గ్లిజరైడ్స్‌ను తగ్గించడానికి కూడా సహాయ పడతాయి. చేపలు తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..