- Telugu News Photo Gallery Consuming poppy seeds can reduce many health problems, check here is details in Telugu
Poppy Seeds Benefits: నిద్ర చక్కగా పట్టాలా.. అయితే గసగసాలను మీ ఆహారంలో చేర్చుకోండి!
భారతీయులు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. మసాలా వంటకాల్లో గసగసాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గసగసాల్లో అనేక పోషకాలు విలువలు ఉన్నాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేవారు.. మీ ఆహారంలో గసగసాలను చేర్చుకోండి. వీటిల్లో ఆల్కలాయిడ్లు అనే నేచురల్..
Updated on: Mar 06, 2024 | 1:28 PM

భారతీయులు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. మసాలా వంటకాల్లో గసగసాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గసగసాల్లో అనేక పోషకాలు విలువలు ఉన్నాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేవారు.. మీ ఆహారంలో గసగసాలను చేర్చుకోండి. వీటిల్లో ఆల్కలాయిడ్లు అనే నేచురల్ రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే నొప్పులను తగ్గించి.. ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తాయి.

బలహీనంగా ఉండేవారికి గసగసాలతో తయారు చేసే ఆహార పదార్థాలు పెట్టడం వల్ల బలంగా, దృఢంగా ఉంటారు. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తితో పాటు తక్షణమే ఎనర్జీ లెవల్స్‌ను కూడా పెంచుతుంది.

చాలా మందికి ఎముకలు అనేవి బలహీనంగా ఉంటాయి. దీంతో ఎముకలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిగా పడుతూ ఉంటారు. గసగసాల్లో మెగ్నీషియం, క్యాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉండేలా చేస్తాయి.

గసగసాలు తినడం వల్ల కంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. ఉబ్బసం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా కీళ్ల నొప్పులు, వాపు, నొప్పి వంటి వాటిని తగ్గించడంలో కూడా సహాయ పడతాయి.





























