Get Rid of Lice: తలంతా పేలు పుచ్చిపోయాయా.. ఈ చిట్కా ట్రై చేశారంటే ఒక్కదెబ్బకే రాలతాయ్!
పెద్దలు, చిన్న పిల్లలు ఇబ్బంది పడే సమస్యల్లో పేల సమస్య కూడా ఒకటి. ఈ పేల సమస్య ఒక పట్టాన అస్సలు తగ్గదు. దీని వల్ల బయటకు వెళ్లినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ సమ్మర్‌లో అయితే వీటి గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా అసౌకర్యంగా ఉంటుంది. దురద, మంట, చికాకుగా అనిపిస్తుంది. తలలో పేలు గుడ్లు కూడా ఎక్కువగా పెట్టడం వల్ల జుట్టు అంతా చిరాకుగా కనిపిస్తుంది. పేలు ఒకరి తలలో నుంచి మరొకరి..

పెద్దలు, చిన్న పిల్లలు ఇబ్బంది పడే సమస్యల్లో పేల సమస్య కూడా ఒకటి. ఈ పేల సమస్య ఒక పట్టాన అస్సలు తగ్గదు. దీని వల్ల బయటకు వెళ్లినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ సమ్మర్‌లో అయితే వీటి గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా అసౌకర్యంగా ఉంటుంది. దురద, మంట, చికాకుగా అనిపిస్తుంది. తలలో పేలు గుడ్లు కూడా ఎక్కువగా పెట్టడం వల్ల జుట్టు అంతా చిరాకుగా కనిపిస్తుంది. పేలు ఒకరి తలలో నుంచి మరొకరి తలలోకి వ్యాపిస్తాయి. ఇవి తలపై రక్తాన్ని తాగి జీవిస్తాయి. వీటి తగ్గించుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పేల కారణంగా కూడా జుట్టు రాలడం వంటివి జరుగుతూ ఉంటాయి. వీటిని తగ్గించుకునేందుకు అద్భుతమైన చిట్కాలు మీ ముందుకు తీసుకొచ్చాం. వీటిని ఫాలో చేస్తే.. పేల సమస్య నుంచి బయట పడొచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వేప నూనె:
పేల సమస్య నుంచి బయట పడేందుకు హెల్ప్ చేయడంలో వేప నూనె చక్కగా పని చేస్తుంది. వేప నూనె ఘాటైన సువాసనను, చేదును కలిగి ఉంటుంది. కాబట్టి ఈ నూనె తలకు అప్లై చేసి.. ఓ గంట సేపు ఉంచి హెడ్ బాత్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కుంకుడు రసం:
కుంకుడు రసం కూడా పేల సమస్యను తగ్గించడంలో సహాయ పడుతుంది. చాలా మంది ఇప్పుడు కుంకుడు రసాన్ని అస్సలు ఉపయోగించడం లేదు. కానీ కుంకుడు రసం వల్ల పేలు చనిపోవడంతో పాటు, జుట్టు రాలడం తగ్గి.. షైనీ అవుతుంది.
పటిక బెల్లం:
పటిక బెల్లంతో కూడా పేల సమస్యను తగ్గించుకోవచ్చు. పటిక బెల్లాన్ని నీటిలో కలిపి.. ఆ నీటిని తలకు అప్లై చేసి మర్దనా చేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే.. పేల సమస్య కంట్రోల్ అవుతుంది.
వేపాకుల పేస్ట్:
వేపాకుల పేస్ట్‌తో కూడా మనం పేల సమస్యలను తగ్గించుకోవచ్చు. వేపాకుల పేస్ట్ ఒక్కసారి ఉపయోగించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వేపాకుల పేస్ట్‌లో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అంతే కాకుండా.. వేపాకుల చేదుకు పేలు చచ్చిపోతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








