Health Benefits: ఖాళీ కడుపుతో ఈ పండును తినండి.. కిడ్నీలో రాళ్లు తేలికగా కరిగిపోతాయి..!
రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె, మెదడుకు రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ పండు తింటే రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. ఈ పండ్లు రోజూ రెండు మూడు తినడం వల్ల రక్తం పలచబడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Kiwi Fruit Health Benefits: అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాల నుండి రక్షించడంలో కివీ పండు తినడం ప్రయోజనకరంగా ఉంటుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. కివీ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్‌లు, విటమిన్ సి ఉన్నాయి. అంటే ఇది బరువు తగ్గడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మీకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మీరు గుండె, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే, ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కివీ పండ్లు తినడం మంచిది.
కివీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, జింక్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్ మొదలైన పోషకాలు ఉన్నాయి. శరీరం సరిగ్గా పనిచేయడానికి ఈ పోషకాలన్నీ అవసరం. అయితే వివిధ రకాల ఆహార పదార్థాలు తినడం ద్వారా లభించే ఈ పోషకాలు, ఒక్క కివీ పండు తినడం ద్వారా కూడా లభిస్తున్నాయంటున్నారు నిపుణులు. కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల కివీని తినడం వల్ల రోజువారీ విటమిన్ సిలో 80శాతం వరకు లభిస్తుంది. విటమిన్ సి శరీరంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక రకాల అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది,
గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు సక్రమంగా పనిచేయడానికి పొటాషియం అవసరం. ఒక కివీలో 215 mg పొటాషియం ఉంటుంది. కాబట్టి ఒక కివీని తీసుకోవడం వల్ల మీ రక్తపోటు, నరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కివీ పండు అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి గుండె సమస్యలను తగ్గించడానికి, కిడ్నీలో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది.
రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె, మెదడుకు రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కివి రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. రోజూ రెండు మూడు కివీ పండ్లను తినడం వల్ల రక్తం పలచబడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..