Dog Becomes Spiderman: స్పైడర్ మ్యాన్‌లా మారిన కుక్క..! ఎదురుపడిందా ఒక్కోడికి సుస్సు పడాల్సిందే..!! వీడియో వైరల్‌..

సాధారణంగా పిట్‌బుల్స్ ఇలా గోడలు ఎక్కలేవు. కానీ వీడియోలో కనిపించే పిట్‌బుల్ చాలా జాగ్రత్తగా గోడకు సమీపంలో ఉన్న చెట్టు ఆధారంగా పైకి ఎక్కుతోంది. అది చూసేందుకు స్పైడర్ మాన్ లాగా కనిపించింది. చివరకు గోడ ఎక్కడంలో సక్సెస్ సాధించింది. ఈ పిట్ బుల్ స్పైడర్ మ్యాన్ గా మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియోను ఎంతగానో లైక్‌ చేస్తున్నారు.

Dog Becomes Spiderman: స్పైడర్ మ్యాన్‌లా మారిన కుక్క..! ఎదురుపడిందా ఒక్కోడికి సుస్సు పడాల్సిందే..!! వీడియో వైరల్‌..
Dog Becomes Spiderman
Follow us
Jyothi Gadda

|

Updated on: May 23, 2024 | 9:22 PM

Dog Becomes Spiderman: ప్రజలు జంతువులను చాలా ప్రేమిస్తారు. ముఖ్యంగా కుక్కలను ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. పెంపుడు జంతువులుగా ఎక్కువ మంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. కుక్కలు ప్రజలకు మంచి స్నేహితులు. విశ్వాసానికి మారుపేరు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో అవి మనిషికి సెక్యూరిటీ గార్డులు, ఆపద్బాంధవులుగా కూడా ఆదుకుంటాయి. అలాంటి కుక్కలలో చాలా జాతులు ఉన్నాయి. ప్రజలు వివిధ జాతుల కుక్కలను ఇష్టపడతారు. అందులో ఒకటి పిట్‌బుల్.. ఈ జాతి కుక్క చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. పిట్‌బుల్ జాతి కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

పిట్‌బుల్‌ జాతి కుక్కలు ఇంటి భద్రత పరంగా చాలా మంచివి. వాటి రూపం, ప్రదర్శనలో చాలా ప్రమాదకరంగా కనిపిస్తాయి. ఈ వీడియోలో పిట్‌బుల్ కుక్క తన చురుకుదనాన్ని చూపుతోంది. అది స్పైడర్ మ్యాన్ లాగా గోడ ఎక్కుతూ చూసేవారిని షాక్‌కు గురిచేసింది. పిట్‌బుల్ చేసిన విన్యాసానికి సంబంధించిన ఈ వీడియోని ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో పిట్‌బుల్ కుక్క తన ప్రతాపం చూపించింది. వీడియోలో బ్లాక్ కలర్ పిట్‌బుల్ కుక్క గోడ ఎక్కేందుకు ఎలాంటి స్టంట్‌ చేసిందో కనిపిస్తుంది. పిట్‌బుల్ కుక్క గోడ, చెట్టుకు మధ్యలోంచి ఎత్తైన ప్రదేశానికి ఎక్కేసింది.. సాధారణంగా పిట్‌బుల్స్ ఇలా గోడలు ఎక్కలేవు. కానీ వీడియోలో కనిపించే పిట్‌బుల్ చాలా జాగ్రత్తగా గోడకు సమీపంలో ఉన్న చెట్టు ఆధారంగా పైకి ఎక్కుతోంది. అది చూసేందుకు స్పైడర్ మాన్ లాగా కనిపించింది. చివరకు గోడ ఎక్కడంలో సక్సెస్ సాధించింది. ఈ పిట్ బుల్ స్పైడర్ మ్యాన్ గా మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియోను ఎంతగానో లైక్‌ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో @Rainmaker1973 అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.6 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. దీనిపై పలువురి నుంచి కామెంట్లు వస్తున్నాయి. దీనిపై ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, ఇది ఎంత అద్భుతంగా ఉంది. అతను దీని కోసం తనను తాను ఎలా సిద్ధం చేసుకుంటాడో మీరు ఊహించలేరు. వీడియో చూసిన నెటిజన్లు స్పైడర్ డాగ్ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..