వేసవిలో గుండెల్లో మంట ఎక్కువైందా..? అయితే, ఈ 5 హోం రెమెడీస్‌ని పాటించండి.!

దీని కోసం అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు ఇంట్లో కొన్ని సహజ పద్ధతుల ద్వారా హార్ట్‌ బర్న్‌ సమస్యను వదిలించుకోవచ్చు. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని హోం రెమిడీస్తో మీరు గుండెల్లో మంట, అసౌకర్యాన్ని వదిలించుకోవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.

వేసవిలో గుండెల్లో మంట ఎక్కువైందా..? అయితే, ఈ 5 హోం రెమెడీస్‌ని పాటించండి.!
Heartburn
Follow us
Jyothi Gadda

|

Updated on: May 23, 2024 | 8:35 PM

గుండెల్లో మంట సమస్య జీర్ణవ్యవస్థకు సంబంధించినది. ఇది తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మరింత తీవ్రమవుతుంది. దీనిని హార్ట్ బర్న్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అని కూడా పిలుస్తారు. దీని కోసం అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు ఇంట్లో కొన్ని సహజ పద్ధతుల ద్వారా హార్ట్‌ బర్న్‌ సమస్యను వదిలించుకోవచ్చు. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని హోం రెమిడీస్తో మీరు గుండెల్లో మంట, అసౌకర్యాన్ని వదిలించుకోవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.

ఆపిల్ సైడర్ వెనిగర్- యాపిల్ సైడర్ వెనిగర్ హార్ట్ బర్న్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ రెండు టీస్పూన్లు ఒక గ్లాసు నీళ్లలో కలుపుకుని తాగితే ఎసిడిటీ తొలగిపోయి బరువు కూడా అదుపులో ఉంటుంది.

లవంగం – గుండెల్లో మంట విషయంలో లవంగాలు కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. మీరు కూడా ఆహారం జీర్ణం కాలేదనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టయితే, రెండు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరించవచ్చు. లవంగాల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనను దూరం చేయడంలో కూడా ఇది చాలా మంచిది .

ఇవి కూడా చదవండి

సెలెరీ ఆకుల వినియోగం- మీరు గుండెల్లో మంటను వదిలించుకోవడానికి సెలెరీని(కొత్తిమీర వంటి ఆకుకూర) కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఒక గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తాగండి లేదా కషాయం చేసి కూడా తాగవచ్చు. ఈ రెండు పద్ధతులు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తొలగిస్తాయి.

కలబంద రసం – అజీర్ణం, గ్యాస్, అసిడిటీ నుండి ఉపశమనం అందించడంలో కూడా కలబంద రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం మీరు దాని గుజ్జు నుండి రసం తయారు చేసి తాగొచ్చు. ఇది మీ జీవక్రియ రేటును కూడా మెరుగుపరుస్తుంది.

మజ్జిగ తాగాలి- మజ్జిగ తీసుకోవడం వల్ల గుండెల్లో మంట నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే అసిడిక్ ఎలిమెంట్స్ అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో దీనిని తీసుకోవడం ద్వారా మీ పొట్టను చల్లగా ఉంచుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..