Mosquito Bite: దోమకాటు నుంచి ఉపశమనం కోసం ఇంటి నివారణ చిట్కాలు..

ఒక గిన్నెలో సమాన మొత్తంలో వోట్మీల్, నీటిని కలిపి వోట్మీల్ పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని దురద ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకుంటే దోమల వల్ల వచ్చే దురదలు, వాపులు తగ్గుతాయి.

Mosquito Bite: దోమకాటు నుంచి ఉపశమనం కోసం ఇంటి నివారణ చిట్కాలు..
Mosquito Bite
Follow us

|

Updated on: Jun 26, 2023 | 8:44 PM

ఎట్టకేలకు ఎండాకాలం అయిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ వానలు మొదలయ్యాయి. ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఈ సమయంలో దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి. నీరు నిలిచి ఉండడం వల్ల దోమలు సులభంగా వృద్ధి చెందుతాయి. సీజన్ మారడంతో దోమల సీజన్ మొదలవుతుంది. ఈ దోమలు రాత్రంతా సరిగ్గా నిద్రపోనియ్యవు.. కొన్ని చోట్ల పగటిపూట కూడా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పార్కు ప్రాంతంలో సాయంత్రం వేళల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమ కాటు వల్ల మంట, దురద వస్తుంది. కొంతమంది సున్నితమైన చర్మం కారణంగా దోమ కాటు కారణంగా చేతులు, ముఖాలపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. ఈ దోమలు ప్రాణాంతక వ్యాధులను తీసుకురావడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా హానికలిస్తాయి. మీరు కూడా దోమ కాటు వల్ల దురద, నొప్పితో అవస్థపడుతున్నట్టయితే.. ఈ చిట్కాలను పాటించండి.

ఐస్ క్యూబ్: మీ శరీరంపై దోమల కారణంగా వాపు ఉంటే, మీరు ఐస్ క్యూబ్ ఉపయోగించవచ్చు. దోమ కాటు మీద ఐస్ క్యూబ్ పెట్టుకుంటే ఉపశమనం ఉంటుంది. ఇది వాపును త్వరగా తగ్గిస్తుంది. ఐస్ క్యూబ్‌ను నేరుగా వాపుపై ఉంచకూడదు. ఒక సన్నని గుడ్డలో ఐస్‌ను చుట్టి వాపు ఉన్న ప్రదేశంలో పెట్టాలి.

అలోవెరా: కలబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది దురద, మంట సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. దోమలు కుట్టిన ప్రదేశంలో కలబందను పూయడం వల్ల మరింత మేలు జరుగుతుంది. మీరు తాజా కలబంద జెల్ ఉపయోగించండి. వాపు మీద అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే వదిలివేయండి.

ఇవి కూడా చదవండి

తేనె: తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది దురదను తగ్గిస్తుంది. మీరు దోమలు కుట్టిన ప్రదేశంలో కొంచెం తేనెను అప్లై చేయాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై శుభ్రం చేసుకోండి.

యాపిల్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్‌లో దూదిని ముంచి దోమలు కుట్టిన ప్రదేశంలో అప్లై చేయాలి. వెనిగర్‌లోని ఆమ్లత్వం దురదను తగ్గిస్తుంది.

బేకింగ్ సోడా: మీరు దోమ కాటు వల్ల వాపు, దురదతో ఇబ్బందిపడుతుంటే.. బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. పేస్ట్ చేయడానికి బేకింగ్ సోడాలో నీటిని కలుపుకోవచ్చు. దీన్ని దోమ కాటుపై పట్టించాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత దానిని కడగాలి. బేకింగ్ సోడాలో దోమ కాటును తగ్గించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

ఓట్ మీల్: తరచుగా అల్పాహారం కోసం ఉపయోగించే ఓట్ మీల్ దురదను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో సమాన మొత్తంలో వోట్మీల్, నీటిని కలిపి వోట్మీల్ పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని దురద ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకుంటే దోమల వల్ల వచ్చే దురదలు, వాపులు తగ్గుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒంటిలోని రోగాలన్ని మటుమాయం చేస్తుంది ఈ ఆకు.. టోటల్ క్లీన్
ఒంటిలోని రోగాలన్ని మటుమాయం చేస్తుంది ఈ ఆకు.. టోటల్ క్లీన్
మైగ్రేన్‌ నొప్పికి సింపుల్ చిట్కా.. నిజంగానే పనిచేస్తుందా.?
మైగ్రేన్‌ నొప్పికి సింపుల్ చిట్కా.. నిజంగానే పనిచేస్తుందా.?
భోజనం చేశాక స్నానం చేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
భోజనం చేశాక స్నానం చేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
బిగ్ బాస్ ద్వారా మెహబూబ్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
బిగ్ బాస్ ద్వారా మెహబూబ్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
టీమిండియాలో చోటు ఏకంగా 17 కిలోలు తగ్గిన గంభీర్ ఫేవరేట్ ప్లేయర్
టీమిండియాలో చోటు ఏకంగా 17 కిలోలు తగ్గిన గంభీర్ ఫేవరేట్ ప్లేయర్
ఈ రీఛార్జ్ ప్లాన్లలో ప్రమాద బీమా.. ప్రకటించిన ఎయిర్ టెల్.. ఎంతంటే
ఈ రీఛార్జ్ ప్లాన్లలో ప్రమాద బీమా.. ప్రకటించిన ఎయిర్ టెల్.. ఎంతంటే
కొబ్బరి నూనె vs నెయ్యి.. ఈ రెండింటిలో జుట్టుకు ఏది మంచిదంటే..
కొబ్బరి నూనె vs నెయ్యి.. ఈ రెండింటిలో జుట్టుకు ఏది మంచిదంటే..
హాయిగా బజ్జో నాన్నా! కుమారుడి ఒడిలో నిద్రపోయిన హార్దిక్ పాండ్యా
హాయిగా బజ్జో నాన్నా! కుమారుడి ఒడిలో నిద్రపోయిన హార్దిక్ పాండ్యా
‘దృశ్యం’ సినిమా తరహాలో శవాన్ని పూడ్చి పెట్టిన జిమ్‌ ట్రైనర్‌..!
‘దృశ్యం’ సినిమా తరహాలో శవాన్ని పూడ్చి పెట్టిన జిమ్‌ ట్రైనర్‌..!
వామ్మో.. ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజరే..
వామ్మో.. ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజరే..
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!