Foods in Cough: దగ్గు వస్తున్నప్పుడు ఈ ఆహారాలు అస్సలు తీసుకోకూడదు..

వాతావరణ పరిస్థితులు మారాయంటే.. ఖచ్చితంగా దగ్గు, జ్వరం, జలుబు వంటివి ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత కేర్ అవసరం. ఒక్కోసారి మందులతో కూడా దగ్గు అనేది తగ్గదు. ఇలా తగ్గకపోవడానికి మీరు తీసుకునే ఆహారాలే కారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు వస్తున్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల దగ్గు, కఫం వంటివి..

Foods in Cough: దగ్గు వస్తున్నప్పుడు ఈ ఆహారాలు అస్సలు తీసుకోకూడదు..
Cough
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 21, 2024 | 7:43 PM

వాతావరణ పరిస్థితులు మారాయంటే.. ఖచ్చితంగా దగ్గు, జ్వరం, జలుబు వంటివి ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత కేర్ అవసరం. ఒక్కోసారి మందులతో కూడా దగ్గు అనేది తగ్గదు. ఇలా తగ్గకపోవడానికి మీరు తీసుకునే ఆహారాలే కారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు వస్తున్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల దగ్గు, కఫం వంటివి మరింత ఎక్కువ అవుతాయట. మరి దగ్గు వస్తున్నప్పుడు తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నం:

చాలా మందికి తెలీని విషయం ఏంటంటే అన్నం తినడం వల్ల కూడా దగ్గు సమస్య పెరుగుతుంది. బియ్యం చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయట. కాబట్టి దగ్గు సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దగ్గు వస్తున్నప్పుడు రాత్రి పూట అన్నం అస్సలు తినకూడదట.

పాలు:

చాలా మందికి తెలీదు. దగ్గు వస్తున్నప్పుడు పాలను తాగకూడదట. దగ్గు ఉన్నప్పుడు పాలు తాగితే దగ్గు, కం మరింత పెరుగుతాయట. కేవలం పాలు మాత్రమే కాదు పాల ఉత్పత్తులను కూడా తీసుకోకూడదట. వీటి వలన దగ్గు సమస్య మరింత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

పంచదార:

దగ్గు వస్తున్నప్పుడు పంచదార తినకూడదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. దగ్గు ఉన్నప్పుడు తీపి పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. లేదంటే శరీరంలో రోగ నిరోధక శక్తి మరింత బలహీనమై.. దగ్గు పెరుగుతుంది.

ఆయిల్ ఫుడ్స్:

దగ్గు ఉన్నప్పుడు ఆయిల్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. వేయించిన ఆహారాలు, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల దగ్గు అస్సలు తగ్గదు. ఇలాంటి ఆహారాలు తీసుకుంటే రాత్రిళ్లు దగ్గు మరింత ఎక్కువ అవుతుంది.

ఆల్కహాల్:

దగ్గులో ఉన్నప్పుడు ఆల్కహాల్ సేవించకూడదు. ఆల్కహాల్ ఉన్న ఆహారాలు కూడా తాగకూడదు. ఒకవేళ తాగినా దగ్గు మరింత పెరగడమే కాకుండా.. ఆరోగ్యం కూడా దెబ్బతీస్తుంది.

దగ్గు తగ్గాలంటే ఇలా చేయండి:

ఘాటు ఉన్న వస్తువులను ఎక్కువగా తీసుకోవడం వల్ల దగ్గు అనేది తగ్గుతుంది. దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, పచ్చి వెల్లుల్లి వంటివి తీసుకుంటే దగ్గు కంట్రోల్ అవుతుంది. పైన చెప్పిన వీటిని పొడుల్లా తయారు చేసుకుని అందులో తేనె రాసి తీసుకుంటే త్వరగా దగ్గు తగ్గుతుంది. తులసి టీ తాగితే మరింత ప్రయోజనం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..