Life style: శరీరంలో ఈ మార్పులా.? అయితే సరిపడ నిద్ర లేనట్లే..

అయితే నిద్రలేమి సమస్య కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్య వేధిస్తుంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి సమయం పెరిగినా కొద్దీ శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. శరీరంలో కొన్ని లక్షణాలు నిద్రలేమీ లక్షణాలుగా భావించాలని...

Life style: శరీరంలో ఈ మార్పులా.? అయితే సరిపడ నిద్ర లేనట్లే..
Sleepless
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2024 | 9:45 PM

మనిషికి తిండి ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి, జీవన విధానం మారింది ఈ కారణంగా నిద్రలేమీ సమస్యతో బాధపడుతున్న వారిక సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్‌ వినియోగం పెరగడం, ఫిష్ట్‌ల్లో పనిచేయడం కూడా నిద్రలేమీకి కారణమవుతుందని నిపుణుల అంటున్నారు.

అయితే నిద్రలేమి సమస్య కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్య వేధిస్తుంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి సమయం పెరిగినా కొద్దీ శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. శరీరంలో కొన్ని లక్షణాలు నిద్రలేమీ లక్షణాలుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

24 గంటలు మించి నిద్రలేమితో బాధపడుతుంటే.. మెదడు పనితీరు మందగించిన భావన కలుగుతుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది, ప్రతీ చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు. నిద్రలేమీ కారణంగా నాడీవ్యవస్థలో సమతుల్యం దెబ్బతింటుంది. కండరాల నొప్పి మొదలవుతుంది. ఒకవేళ మూడు రోజులపాటు నిద్రలేకపోతే.. మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు చెబుతున్నారు.

నిత్యం దిగాలుగా ఉండడం, మతి స్థిమితంగా లేకపోవడం, చర్మంపాలిపోవడం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటి చూపుక్రమంగా మందగిస్తుంది. ఇక ఒకవేళ వారం రోజులకు మించి నిద్రలేమితో బాధపడుతుంటే మాత్రం మనిషి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. నెలరోజులు నిద్రకు దూరమైతే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా మనిషి ఆలోచించే శక్తిని కూడా కోల్పోతుంటారు. చమటలు పట్టడం, త్వరగా బరువు తగ్గడం, హార్మోన్లలో వ్యత్యాసం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?