Ginger: పచ్చి అల్లం తినడం కష్టమే.. కానీ తింటే మాత్రం..
అల్లం మనం ప్రతీ రోజూ కచ్చితంగా ఉపయోగించే ఆహార పదార్థం. అల్లం లేనిది ఏ వంటకం పూర్తికాని పరిస్థితి ఉంటుంది. అంతేనా అల్లంతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే అల్లాన్ని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ముఖ్యంగా అల్లాన్ని తీసుకోవడం వల్ల...

అల్లం మనం ప్రతీ రోజూ కచ్చితంగా ఉపయోగించే ఆహార పదార్థం. అల్లం లేనిది ఏ వంటకం పూర్తికాని పరిస్థితి ఉంటుంది. అంతేనా అల్లంతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే అల్లాన్ని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ముఖ్యంగా అల్లాన్ని తీసుకోవడం వల్ల మైగ్రేన్ నొప్పితో పాటు రక్తపోటు, కడుపు సంబంధిత వ్యాధులు సైతం దరిచేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.
అయితే సాధారణంగా మనం అల్లాన్ని వంటల్లోనే వేసుకుంటాం. అలా కాకుండా పచ్చి అల్లం తింటే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వామ్మో పచ్చి అల్లం తింటే నోరంతా మండుతుందని అనుకుంటున్నారు కదూ! అయితే పచ్చి అల్లాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మరో స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి అల్లం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పచ్చి అల్లంలోని విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్లు, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు ఎన్నో రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో పచ్చి అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మగవారికి పచ్చి అల్లం మరింత మేలు చేస్తుంది. పురుషుల్లో టెస్టోస్టిరాన్ పెంచడంలో అల్లం ఉపయోగపడుతుంది. పచ్చి అల్లం కడుపుకు చాలా మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో అల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది.
కడుపు నొప్పి, తిమ్మిరి వంటి ఇబ్బందులతో బాధపడేవారికి పచ్చి దివ్యౌషధంగా చెప్పొచ్చు. కడుపునొప్పి వేధిస్తుంటే ఒక చిన్న అల్లం ముక్కను తినండి వెంటనే మార్పు కనిపిస్తుంది. ఇక మగవారిలో వచ్చే లైంగిక సమస్యలకు కూడా అల్లం దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరిలో పచ్చి అల్లం తీసుకుంటే ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లం తీసుకునే ముందు వైద్యుల సూచనలు పాటించడం బెస్ట్.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




