- Telugu News Photo Gallery Dates Benefits: Eat Dates Daily To Take Care Of 6 Important Parts Of Your Body
Dates Benefits: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే కాసిన్ని ఖర్జూరాలు తినండి..
ఏడాది పొడవునా మార్కెట్‌లో లభించే పండ్లలో ఖర్జూరం ఒకటి. వివిధ రకాల ఖర్జూరాలు మార్కెట్లో లభిస్తుంటాయి. అన్ని రకాల ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని 'సూపర్ ఫుడ్' అని కూడా పిలుస్తారు. ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. రోజూ ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 24, 2024 | 1:40 PM

ఖర్జూరం గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 2 ఖర్జూరాలు తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి.

ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6, కె అధికంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఖర్జూరంలో పోషక విలువలు చాలా ఎక్కువ. ఖర్జూరం తినడం వల్ల ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. అందుకే ఉపవాసం తర్వాత ఖర్జూరం తినడం మంచిది.

డ్రై ఫ్రూట్స్ పిల్లలకైనా, పెద్దలకైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరం కూడా ఒకటి. రోజుకు రెండు నుంచి నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, ఇవి శరీరంలో వేడి చేస్తాయి. అంటే వాటిని తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అందుకే సాధారణంగా డ్రై ఫ్రూట్స్ శీతాకాలం లేదా చల్లని ప్రదేశాల్లో ఎక్కువగా తింటారు.

మలబద్ధకం సమస్యలున్న వారు ఆహారంలో ఖర్జూరాలను తీసుకోవాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అందుకే ఖర్జూరం వేసవిలో తినాలా వద్దా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో కూడా ఖర్జూరాన్ని తినవచ్చు. కానీ ఎక్కువగా తినకూడదు. రోజుకు 1-2 ఖర్జూరాలను నానబెట్టి తినవచ్చు. ఇది గుండె ఆరోగ్యం నుంచి జీవక్రియను పెంచడం వరకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి.




