AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Melon Benefits: ఈ వేసవి పండు చేసే మేలు తల్లి కూడా చేయలేదు.. గుండె సమస్యలకు చక్కని నివారిణి!

వేసవి పండ్లలో పుచ్చకాయ ముఖ్యమైనది. ఈ పండును పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. పుచ్చకాయ రుచిగా ఉండటమేకాదు చాలా సేపు కడుపు నిండుగా ఉంచుతుంది కూడా. పుచ్చకాయలో పోషక విలువలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే పుచ్చకాయను విటమిన్ల రిజర్వాయర్ అని అంటారు. పుచ్చకాయలో 80-90 శాతం నీరు ఉంటుంది. ఫలితంగా పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది..

Srilakshmi C
|

Updated on: May 24, 2024 | 1:24 PM

Share
ఈ గింజలు తినటం వల్ల  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పుచ్చకాయ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇది ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

1 / 5
పుచ్చకాయలో 80-90 శాతం నీరు ఉంటుంది. ఫలితంగా పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల విపరీతమైన వేడిలో కూడా శరీరం చల్లగా ఉంటుంది. అంతే కాకుండా చర్మం తాజాగా ఉంటుంది. మొటిమల సమస్య చాలా వరకు దూరం చేసుకోవచ్చు.

2 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయ తినడం వల్ల విటమిన్-ఎ, విటమిన్-సి లోపం భర్తీ అవుతుంది. అంతేకాకుండా ఇందులో పొటాషియం, కాల్షియం కూడా చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి సమ్మర్ డైట్ లో పుచ్చకాయను చేర్చుకోవచ్చు. 80% పుచ్చకాయలో విటమిన్ ఎ ఉంటుంది. విటమిన్ ఎ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి, దృష్టిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

3 / 5
పుచ్చకాయలో తగినంత మొత్తంలో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

4 / 5
పుచ్చకాయలో పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడంలో కూడా పుచ్చకాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా పుచ్చకాయ సహాయపడుతుంది. ఫలితంగా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పుచ్చకాయను ప్రతిరోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో 80-90 శాతం నీరు ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా శరీరానికి తక్కువ క్యాలరీలు చేరుతాయి. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి పుచ్చకాయ భేషుగ్గా తినవచ్చు.

5 / 5