- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu Luxury Cars Collections Lamborghini Gallardo to Range Rover
Mahesh Babu: ఇది కదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. మహేష్ కార్ల కలెక్షన్ చూస్తే మతిపోవాల్సిందే.. ఎన్ని ఉన్నాయంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న మహేష్.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు. మరీ అలాంటి సూపర్ స్టార్ కార్ కలెక్షన్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా.. ?
Updated on: May 24, 2024 | 1:55 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న మహేష్.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు. మరీ అలాంటి సూపర్ స్టార్ కార్ కలెక్షన్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా.. ?

రేంజ్ రోవర్ వోగ్.. మహేష్ వద్ద ఉన్న రేంజ్ రోవర్ వోగ్ కారు 3.0-లీటర్ V6 డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 240 Bhp శక్తిని, భారీ 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ.3.38 కోట్లు.

ఆడి ఇ-ట్రాన్.. మహేష్ వద్ద రూ. 1.19 కోట్ల విలువైన ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు ఉంది. ఎలక్ట్రిక్ SUV హై-స్పీడ్ ఛార్జింగ్, ఆల్-వీల్ డ్రైవ్‌ను కలిగి ఉంది. ఇది 71kWh బ్యాటరీతో వస్తుంది. గరిష్టంగా 308 hp, 540 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

రేంజ్ రోవర్ వోగ్ ఆటోబయోగ్రఫీ.. మహేష్ గ్యారేజీలో ఉన్న ఈ కారు ధర రూ. 2.18 కోట్లు. ఇది రేంజ్ రోవర్ కారు మొదటి లగ్జరీ రైడ్.

BMW 730Ld.. రూ. 1.30 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఈ లగ్జరీ కారు.. మోడల్ 7 సిరీస్ లైనప్‌లోని డీజిల్ వేరియంట్. వినూత్నమైన ఫీచర్స్, ప్రత్యేకమైన డ్రైవింగ్ డైనమిక్స్ కలిగి ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఇ.. మహేష్ వద్ద ఉన్న ఈ మోడల్ కారు E సిరీస్ 5 వేరియంట్‌లలో వస్తుంది. ఈ కారు ధర రూ. రూ. 66.99 లక్షల నుండి రూ. 84.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు గరిష్టంగా 281 బిహెచ్‌పి పవర్, 600ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

లంబోర్ఘిని గల్లార్డో.. మహేష్ కార్ల సేకరణలో లగ్జరీ కారు లంబోర్ఘిని గల్లార్డో ఉంది. కేవలం రెండు సీట్లు కలిగి ఉన్న ఈ కారు రూ.2.80 కోట్లు ఉంటుంది. ఈ కారు గరిష్టంగా 550బిహెచ్‌పి పవర్, 540ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మెర్సిడెస్ GL క్లాస్.. మహేష్ బాబు గ్యారేజీలో పార్క్ చేసిన మరో మెర్సిడెస్ తెల్లటి మెర్సిడెస్ GL క్లాస్ SUV. ఇది అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వద్ద కూడా ఉంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ V8.. రూ.1.5 కోట్ల విలువైన ఈ కారులో 7 సీట్లు ఉన్నాయి. 4461 cc డీజిల్ ఇంజన్ ఉంది. ఈ కారు గరిష్టంగా 262 bhp & 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.




