AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pian in Soles: అరికాళ్లలో నొప్పులు, మంట వేదిస్తోందా.. అస్సలు అశ్రద్ధ చేయకండి..

పాదాలపైనే శరీర బరువు అంతా ఉంటుంది. శరీరంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవయవాల్లో పాదాలు కూడా ఒకటి. నడక వచ్చినప్పటి నుంచి పాదాలపై శ్రమ పెరుగుతూనే ఉంటుంది. కానీ పాదాల ఆరోగ్యంపై ఎవరూ అంతగా శ్రద్ధ అనేది పెట్టరు. పాదాల ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ పాదాల్లో వచ్చే మంట, నొప్పులను కూడా ఈజీగానే తీసుకుంటారు. కానీ ఈ పరిస్థితి వివిధ రకాల పాదాల సమస్యలకు దారి తీస్తుంది. చాలా మందిలో అరి కాళ్లలో మంటు, నొప్పులు వంటివి..

Pian in Soles: అరికాళ్లలో నొప్పులు, మంట వేదిస్తోందా.. అస్సలు అశ్రద్ధ చేయకండి..
Pian In Soles
Chinni Enni
|

Updated on: Oct 11, 2024 | 12:40 PM

Share

పాదాలపైనే శరీర బరువు అంతా ఉంటుంది. శరీరంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవయవాల్లో పాదాలు కూడా ఒకటి. నడక వచ్చినప్పటి నుంచి పాదాలపై శ్రమ పెరుగుతూనే ఉంటుంది. కానీ పాదాల ఆరోగ్యంపై ఎవరూ అంతగా శ్రద్ధ అనేది పెట్టరు. పాదాల ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ పాదాల్లో వచ్చే మంట, నొప్పులను కూడా ఈజీగానే తీసుకుంటారు. కానీ ఈ పరిస్థితి వివిధ రకాల పాదాల సమస్యలకు దారి తీస్తుంది. చాలా మందిలో అరి కాళ్లలో మంటు, నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి. వాటికి ఏదో కొబ్బరి నూనె, బామ్ రాసి వదిలేస్తారు. కానీ దీనినే వైద్య పరంగా న్యూరోపతి లేదా పారేస్తిసియా అంటారు. పాదాల్లో ఉండే నరాలు దెబ్బ తినడం, నరాలపై ఎక్కువగా ఒత్తిడి పడటం వల్ల నొప్పి వచ్చి మంట పుడుతుంది. మరి పాదాల్లో నొప్పి, మంట రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటీస్:

షుగర్ వ్యాధితో బాధ పడేవారిలో కూడా అరికాళ్లలో నొప్పులు, మంట అనేది వస్తుంది. తగినంత స్థాయిలో హార్మోన్‌లు ఉత్పత్తి కాకపోవడం వల్ల నొప్పలుు వస్తాయి. కిడ్నీ జబ్బులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల కారణంగా కూడా పాదాల్లో నరాలు దెబ్బతిని నొప్పులు వస్తాయి.

నెలసరి సమస్యలు:

పాదాల్లో నొప్పులు, మంట అనేది ఎక్కువగా ఆడవారిలో వస్తాయి. ఆడవారిలో నెలసరి నిలిచిపోయినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. మరికొందరికి మానసిక సమస్యల కారణంగా కూడా రావచ్చు. ఇంకొందరికి ఎలాంటి కారణాలు లేకుండానే నొప్పులు అనేవి వస్తాయి.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణ:

శరీరంలోని వివిధ భాగాలకు సరిగా రక్త ప్రసరణ జరగని సమయంలో కూడా పాదాల్లో మంట, నొప్పులు అనేవి వస్తాయి. అంతే కాకుండా రక్త హీనత, ఎయిడ్స్, మూత్ర పిండాల వైఫల్యం కారణాల వల్ల కూడా అరికాళ్లలో మంటలు వస్తాయి.

మద్యం తాగడం:

మద్యం తాగే వారిలో కూడా మంటలు, నొప్పులు వస్తాయి. మద్యం ఎక్కువగా తీసుకునే వారు డీహైడ్రేషన్‌కు గురికావడం, రక్త ప్రసరణ సరిగా జరగలేక పోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అదే విధంగా విటబిన్ బి 12 లోపం కారణంగా కూడా వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే