- Telugu News Photo Gallery If cleaned like this, brass idols and pooja items will shine, Check Here is Details
Kitchen Hacks: ఇత్తడి విగ్రహాలను, వస్తువులను ఇలా క్లీన్ చేస్తే మెరిసి పోతాయి..
పండుగల సమయాలు వచ్చేశాయి. ఈ సమయంలో భగవంతుడిని, అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇత్తడి విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. ఆ విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేస్తూ ఉంటారు. దీంతో విగ్రహాలు, వస్తువులకు కాస్త రంగు తగ్గి నల్లగా మారిపోతాయి. ఈ విగ్రహాలు, వస్తువులను మళ్లీ కొత్త వాటిలా మెరిసేలా చేయాలంటే.. ఇప్పుడు చెప్పే ఈ టిప్స్ ఎంతో చక్కగా పని చేస్తాయి. అంతే కాకుండా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఎక్కువ సమయం..
Updated on: Oct 12, 2024 | 8:20 AM

పండుగల సమయాలు వచ్చేశాయి. ఈ సమయంలో భగవంతుడిని, అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇత్తడి విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. ఆ విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేస్తూ ఉంటారు. దీంతో విగ్రహాలు, వస్తువులకు కాస్త రంగు తగ్గి నల్లగా మారిపోతాయి.

ఈ విగ్రహాలు, వస్తువులను మళ్లీ కొత్త వాటిలా మెరిసేలా చేయాలంటే.. ఇప్పుడు చెప్పే ఈ టిప్స్ ఎంతో చక్కగా పని చేస్తాయి. అంతే కాకుండా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా విగ్రహాలను డిష్ వాషర్ సబ్బు లేదా లిక్విడ్‌తో క్లీన్ చేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా గోధుమ పిండి, అర టీ స్పూన్ ఉప్పు, వైట్ వెనిగర్ కలిపి పేస్టులా చేయాలి. దీన్ని విగ్రహాలు, వస్తువులపై రుద్ది శుభ్రం చేయాలి. ఇలా చేస్తే తెల్లగా మారుతాయి.

ఈ చిట్కా కూడా చక్కగా వర్క్ చేస్తుంది. కొద్దిగా నిమ్మరసంలో, బేకింగ్ సోడా కలపాలి. ఈ పేస్టును స్క్రబ్బర్‌తో విగ్రహాలను రుద్ది.. నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే విగ్రహాలు కొత్త వాటిలా మెరుస్తాయి. మంచి సువాసన కూడా వస్తుంది.

అలాగే ఇత్తడి, రాగి వస్తువులను శుభ్రం చేయడంలో చింత పండు ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. అయితే చింత పండు గుజ్జు తీసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో విగ్రహాలు, వస్తువులను శుభ్రం చేస్తే తెల్లగా మెరుస్తాయి.




