Yoga Asanas for Belly: బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే బెస్ట్ యోగాసనాలు ఇవే.. వారం రోజుల్లోనే రిజల్ట్..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య కూడా ఒకటి. బెల్లీ ఫ్యాట్ కారణంగా నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ బెల్లీ ఫ్యాట్ ‌ని తగ్గించాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. పొట్టను తగ్గించడానికి చాలా మంది తినడం తగ్గించేస్తారు. కానీ దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సరిగా తినక చాలా నీరసించి పోతారు. అలా కాకుండా.. సరైన హెల్దీ డైట్ మెయిన్‌టైన్ చేస్తూ ఇప్పుడు చెప్పే ఎక్సర్ సైజులు చేస్తే..

Yoga Asanas for Belly: బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే బెస్ట్ యోగాసనాలు ఇవే.. వారం రోజుల్లోనే రిజల్ట్..
Yoga Asanas For Belly
Follow us

|

Updated on: Aug 07, 2024 | 5:08 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య కూడా ఒకటి. బెల్లీ ఫ్యాట్ కారణంగా నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ బెల్లీ ఫ్యాట్ ‌ని తగ్గించాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. పొట్టను తగ్గించడానికి చాలా మంది తినడం తగ్గించేస్తారు. కానీ దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సరిగా తినక చాలా నీరసించి పోతారు. అలా కాకుండా.. సరైన హెల్దీ డైట్ మెయిన్‌టైన్ చేస్తూ ఇప్పుడు చెప్పే ఎక్సర్ సైజులు చేస్తే.. ఎలాంటి పొట్ట అయినా తగ్గాల్సిందే. ఈ యోగాసనాలు పొట్టను కదిలించి.. పేరుకు పోయిన కొవ్వును కరిగిస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. మరి బెల్లీ ఫ్యాట్‌ తగ్గించడానికి ఎలాంటి ఆసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వృక్ష ఆసనం:

ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలో బ్యాలెన్స్ పెరుగుతుంది. కాళ్ల కండరాలు, వెన్నుముక బలంగా తయారవుతాయి. పొట్ట, కాళ్ల తొడల్లో పేరుకు పోయిన కొవ్వును కరిగిస్తుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆ యోగాసనం వేస్తే వేయాలి. కనీసం ఈ ఆసనంలో 5 నిమిషాలు ఉండాలి.

2. త్రికోణాసనం:

త్రికోణాసనాన్ని ఇంగ్లీషులో ట్రయాంగిల్ పోజ్ అని అంటారు. ఆ ఆసనం త్రిభుజాకారంలో వేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల తొడ కండరాలు, పొట్ట కండరాలు అనేవి సాగుతాయి. దీని వల్ల పొట్టలోని చెడు కొవ్వు అనేది కరుగుతుంది. వెన్నుముక కూడా బలంగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

3. భుజంగాసనం:

భుజంగాసనంతో కేవలం బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఆసనం వేయడం వల్ల పొత్తి కడుపుపై ప్రభావం పడుతుంది. దీంతో పొట్టలోని కండరాలు కదులుతాయి. దీంతో బెల్లీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. అంతే కాకుండా భుజాలు, మెడ బలంగా మారతాయి.

4. పర్వతాసనం:

బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో పర్వతాసనం కూడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఈ ఆసనం కొండ ఆకృతిని తలపించేలా ఉంటుంది. ఆ ఆసనం వేయడం వల్ల పొట్టపై ప్రెషర్ పడుతుంది. దీంతో పొట్టలోని కండరాలు అన్నీ కదులుతాయి. అదే విధంగా కొవ్వు కూడా కరుగుతుంది. ఈ ఆసనం వేయడం చాలా సింపుల్. అంతే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఒత్తిడి దూరం అవుతుంది. చర్మం, జుట్టు కాంతివంతంగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..