Yoga for Diabetes: డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే బెస్ట్ యోగా ఆసనాలు ఇవే..

యోగా గురించి ప్రత్యేకంగా పరియాలు అవసరం లేదు. యోగాతో నయం చేయలేని వ్యాధులు, రోగాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. యోగాతో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు అంటే.. చర్మ, జుట్టు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది. ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది షుగర్‌ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటీస్ జీవితంలో..

Yoga for Diabetes: డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే బెస్ట్ యోగా ఆసనాలు ఇవే..
Yoga For Diabetes
Follow us
Chinni Enni

|

Updated on: Sep 20, 2024 | 1:20 PM

యోగా గురించి ప్రత్యేకంగా పరియాలు అవసరం లేదు. యోగాతో నయం చేయలేని వ్యాధులు, రోగాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. యోగాతో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు అంటే.. చర్మ, జుట్టు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది. ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది షుగర్‌ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటీస్ జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టం. దీన్ని కంట్రోల్ చేసుకోవంటే పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిరంతరం మందులు ఉపయోగిస్తూనే ఉండాలి. ఇలా సహజంగానే డయాబెటీస్‌ను తగ్గించడంలో యోగా ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. మరి ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

భుజంగాసనం:

డయాబెటీస్‌ను తగ్గించడంలో భుజంగాసనం ఎంతో చక్కగా పని చేస్తుంది. దీనిని భుజంగాసనం లేదా సర్పాసనం అంటారు. భుజంగాసనం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ ఆసనం వేయడం వల్ల వెన్నుముక, చేతులు బలంగా, దృఢంగా మారతాయి. అదే విధంగా డయాబెటీస్‌తో బాధ పడేవారు తరచూ ఈ ఆసనం వేయడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

మకరాసనం:

మకరాసనం వేయడం వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మకర అంటే మొసలి. ఈ భంగిమ కూడా మొసలి ఆకారంలోనే ఉంటుంది. అందుకే దీన్ని మకరాసనం అంటారు. ఈ ఆసనడం వేయడం వల్ల కడుపుపై ఒత్తిడి పడుతుంది. ఈక్రమంలో బరువు కూడా తగ్గొచ్చు. ప్రతిరోజూ ఈ ఆసనం వేయడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. డయబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మండూకాసనం:

మండూకాసనం వేయడం వలన కూడా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మండూకం అంటే కప్ప. ఇది ఛాతీ, భుజాలు, కాళ్లు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటీస్‌తో బాధ పడేవారు ప్రతి రోజూ ఈ ఆసనం వేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఈ ఆసనం వేయడం ఒత్తిడి, ఆందోళన అనేవి కంట్రోల్ అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..