చెరకు రసంతో కాలేయ సమస్యలకు చెక్‌.. రోజూ ఇలా తీసుకోండి

14 January 2025

TV9 Telugu

TV9 Telugu

తియ్యగా.. నోటికి కమ్మగా, అమృతంలా అనిపించే చెరకు రసం ఇష్టపడని వారుండరు. ఏ తీపి పదార్థం తయారవ్వాలంటే చెరకుతోనే మొదలు కావాలి

TV9 Telugu

రుచికే కాదు చెరకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కాదు. వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. చెరకు రసం తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది

TV9 Telugu

అందుకే చాలా మంది ఈ పానీయంలో అల్లం, నిమ్మకాయను కూడా కలిపి తీసుకుంటూ ఉంటారు. ఈ జ్యూస్‌ సేవిస్తే మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. అలాగే మూత్ర పిండాల ఆరోగ్యాన్ని పెంచుతుంది

TV9 Telugu

రోజూ చెరుకు రసం తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపు నొప్పి తగ్గుతుంది. శరీరంలో వేడి పెరగకుండా చేస్తుంది. యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది

TV9 Telugu

కాలేయానికి వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా కామెర్ల వ్యాధి నుంచి కాపాడుతుంది. చెరకు రసంలోని గుణాలు శరీరం డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. ఎలక్ట్రోలైట్ లను తిరిగి నింపడానికి సహకరిస్తుంది. అలాగే కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కూడా ఇస్తుంది

TV9 Telugu

చెరకు రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చెరకులో పీచు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ కాలం ఆకలి కలిగించదు. కాబట్టి మీరు త్వరగా బరువు తగ్గవచ్చు

TV9 Telugu

చెరకు గడలను నమలడం వల్ల ఆరోగ్యానికే కాదు చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చెరకు రసంతో శరీరాన్ని నిర్విషీకరణ చేయడం సులభం

TV9 Telugu

చెరకు నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది. దంతాలను సులభంగా శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మినరల్స్, పోషకాలతో ఉంటుంది శక్తిని పెంచుతుంది