AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా.? అయితే ఈ వంటింటి చిట్కాలను ట్రై చేయండి.!

Health Tips: సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో

Health Tips: కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా.? అయితే ఈ వంటింటి చిట్కాలను ట్రై చేయండి.!
Health Tips
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 23, 2021 | 4:40 PM

Share

సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. వాటి పనితీరు సరిగ్గా ఉంటేనే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. సున్నితంగా ఉండే వాటిని కాపాడుకోవాలంటే తగినన్ని నీళ్లు తాగడమే కాకుండా, సరైనా పోషకాహారాన్ని తీసుకోవాలి. అయితే కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.? కిడ్నీల్లో రాళ్లను వంటింటి చిట్కాలతో ఎలా కరిగించవచ్చు.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీల్లో రాళ్లు కరిగించే వంటింటి చిట్కాలు.!

  • రణపాల మొక్క ఆకు, కాస్త చక్కెర కలిపి గ్రైండ్ చేసి.. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. తద్వారా స్టోన్స్‌ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
  • ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో సగం నిమ్మకాయను పిండుకుని తాగితే, రాళ్లను సులభంగా కరిగించవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఇలా తాగడం మరింత ప్రయోజనకరం.
  • ముందుగా ఏలకుల గింజలను పొడిగా చేయండి. ఆ తర్వాత ఒక గ్లాసు నీటిలో 1 స్పూన్ పొడిని కలపండి. అంతేకాకుండా 1 స్పూన్ చక్కెర, కొన్ని పుచ్చకాయ గింజలను ఆ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే అందులోని గింజలను, ఆ నీటిని తాగండి. కొన్నిరోజుల పాటు ఇలా చేస్తే.. సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
  • ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగి తినండి. అలాగే ఉదయం ఎక్కువగా నీళ్లు తాగండి. కొన్ని రోజులు ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
  • ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయను పిండుకుని.. అందులో కొద్దిగా ఆలివ్ నూనెను కలపండి. ఇక ఆ నీటిని తాగండి. కొద్దిరోజులు ఇలా చేయడం వల్ల మీరు సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
  • ఆపిల్ వెనిగర్‌లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి సహాయపడుతుంది. రోజూ వెచ్చని నీటితో రెండు టీస్పూన్ల వెనిగర్ తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

మరోవైపు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఉప్పును తగ్గించడంతో పాటు మాంసం తీసుకోవడం తగ్గించాలి. అలాగే చాక్లెట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తగ్గించాలి.

Disclaimer: ఇది కేవలం వైద్యుల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే.. దీనితో టీవీ9కి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఏదైనా చిట్కాలను పాటించాలనుకుంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించండి..

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!