Health Tips: 40 సంవత్సరాలు ఉన్నవారికి హెచ్చరిక.. ఈ లక్షణాల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.!

''ఆరోగ్యమే మహాభాగ్యం'' అని అంటుంటారు. ఆరోగ్యంగా ఉంటేనే సకల ఐశ్వర్యాలు, అదృష్టం కలిసొస్తుంది. ఇక ఇలా ఉండాలంటే.. మనతో పాటు..

Health Tips: 40 సంవత్సరాలు ఉన్నవారికి హెచ్చరిక.. ఈ లక్షణాల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.!
Health
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:07 PM

”ఆరోగ్యమే మహాభాగ్యం” అని అంటుంటారు. ఆరోగ్యంగా ఉంటేనే సకల ఐశ్వర్యాలు, అదృష్టం కలిసొస్తుంది. ఇక ఇలా ఉండాలంటే.. మనతో పాటు మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వ్యాధులు మన దరికి చేరకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వయసు పెరిగే కొద్దీ శరీర సామర్ధ్యం తగ్గుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు, వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పుకుండా వ్యాయామం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.

వృద్ధాప్యం అనేది ఒక సహజ దృగ్విషయం. దాన్ని ఆపడానికి మనం ఏం చేయలేం. 30 సంవత్సరాల వయస్సులో శరీరం యవ్వనంగా ఉంటుంది. మనం కూడా బలంగానే ఉంటాం. కానీ 40 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి శరీరంలో మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు 40 ఏళ్లు వయస్సు ఉన్న పురుషులలో కనిపిస్తే, వాటిని విస్మరించవద్దు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

బరువు పెరగడం లేదా తగ్గడం..

మీరు సడన్‌గా బరువు పెరిగినా లేదా తగ్గినా.. ఆ మార్పు ఎందువల్ల వచ్చిందో మీకు తెలియకపోతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఉదాహరణకు మధుమేహం బరువు తగ్గడానికి కారణం అవుతుంది. కొలెస్ట్రాల్ బరువు పెరగడానికి దారి తీస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు మీరు షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి.

గుండెల్లో మంట..

కొన్నిసార్లు సరిగ్గా టైంకు తినకపోవడం వల్ల లేదా డైజేషన్ ప్రాబ్లమ్స్ కారణంగా గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది పదేపదే వస్తే.. వెంటనే డాక్టర్లను సంప్రదించండి. గుండె బలహీనంగా ఉన్నా కూడా.. గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుంది.

తరచుగా తలనొప్పి..

మీకు తరచుగా తలనొప్పి సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందువల్ల వ్యాధి తక్కువగా ఉన్నప్పుడే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

కీళ్ళ నొప్పి..

కీళ్ల నొప్పులు అంటేనే మీ శరీరం రోజురోజుకూ బలహీనపడుతోందని అర్ధం. ఎలాంటి సమస్యనైనా నివారించాలంటే.. దానికి సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. అందుకే కీళ్ల నొప్పులు ప్రారంభ దశలోనే వైద్యుడిని సంప్రదించండి.

తరచుగా మూత్ర విసర్జన..

మీ తరచుగా మూత్ర విసర్జన సమస్యను ఎదుర్కొంటుంటే అది మీకు ప్రమాదకరమని గుర్తించండి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఒక సాధారణ వ్యక్తి రోజుకు 3 లీటర్లకు మించి మూత్ర విసర్జన చేస్తే అతడు పాలియురియా అనే వ్యాధితో బాధపడుతున్నాడని అర్థం.

వెన్నునొప్పి..

మీకు మెడ నుండి నడుము వరకు భరించలేని నొప్పి ఉంటే, మీ వెన్నెముక ఎముకలు బలహీనంగా ఉన్నట్లే. వెన్నుముక శరీరంలో ముఖ్యమైన భాగం. అశ్రద్ధ వహించకండి.. వెన్నునొప్పి మొదలైతే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..