AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 5 అలవాట్లు గుండెకు ప్రమాదకరం.. మార్చుకోకుంటే మీ లైఫ్ షెడ్డుకే

గత కొంత కాలంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఈ గుండె జబ్బులు రాత్రికి రాత్రే వచ్చేవి కావు.. మన రోజువారీ చెడు అలవాట్లు క్రమంగా మన హృదయాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా గుండెకు నిశ్శబ్దంగా హాని కలిగించే ఆరు అలవాట్లు ఉన్నాయని.. వాటికి వెంటనే గుడ్ బై చెప్పమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ 5 అలవాట్లు గుండెకు ప్రమాదకరం.. మార్చుకోకుంటే మీ లైఫ్ షెడ్డుకే
Heart Health
Surya Kala
|

Updated on: Oct 13, 2025 | 6:45 PM

Share

గుండెకి ఆనారోగ్యం అనేది రోజుకి రోజే వచ్చేయదు. నేటి వేగవంతమైన ప్రపంచంలో పేలవమైన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి , శారీరక శ్రమ లేకపోవడం గుండె సంబంధిత అనేక సమస్యలకు దోహదం చేస్తున్నాయి. అయితే గుండె జబ్బులు అకస్మాత్తుగా అభివృద్ధి చెందవు. మనం తినే ఆహారం, ద్రపోయే సమయం, మానసిక ఒత్తిడి, ఈ అంశాలన్నీ క్రమంగా మన గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, ఒత్తిడి , నిద్ర లేకపోవడం వంటి కొన్ని సాధారణ అలవాట్లు క్రమంగా మనిసి గుండెను బలహీనపరుస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలలో శుద్ధి చేసిన పిండి పదార్ధాలు, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ , సోడియం అధికంగా ఉంటాయి. ఈ ఆహారాలను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి ఉపయోగించే పదార్ధాలు శరీరానికి చాలా హానికరం. సోడియం దాదాపు 70-80% ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉంటుంది. ఇది రక్త నాళాలను దెబ్బతీస్తుంది. రక్తపోటును పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

అధిక చక్కెర పానీయాలు 12 ఔన్సుల సోడా క్యాన్ లో దాదాపు 35-40 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది నిమిషాల్లోనే రక్తంలో కలిసి ఇన్సులిన్‌లో వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. దీన్ని పదే పదే తీసుకోవడం వల్ల శరీరం ఇన్సులిన్‌కు సున్నితంగా మారదు..కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వలన ట్రైగ్లిజరైడ్‌లు పెరుగుతాయి.

ఎక్కువసేపు కూర్చోవడం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ల కండరాల పంపింగ్ ..రక్త ప్రసరణ తగ్గుతుంది. మూడు గంటలు ఒకే చోట కూర్చోవడం వల్ల రక్తనాళాల పనితీరు తగ్గుతుంది. 10 గంటలకు పైగా కూర్చునే వారికి రక్తం గడ్డకట్టే ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుంది.

సరిగా నిద్ర లేకపోవడం నిద్ర అంటే కేవలం విశ్రాంతి మాత్రమే కాదు..అది శరీరానికి మరమ్మత్తు ప్రక్రియ కూడా. చిన్న లేదా విచ్ఛిన్నమైన నిద్ర సానుభూతి నాడీ యవస్థను సక్రియం చేస్తుంది.ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతుంది. దీర్ఘకాలిక నిద్ర లేమి గుండె నాళాల స్థితిస్థాపకతను తగ్గిస్తుంది. గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.

ధూమపానం, వేపింగ్ ధూమపానం, వేపింగ్ రెండూ గుండె..రక్త నాళాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కసారి వేపింగ్ సెషన్ కూడా ధమని దృఢత్వాన్ని పెంచుతుంది. అదే సమయంలో రక్తపోటును పెంచుతుంది. దీర్ఘకాలిక ఉపయోగం ఎండోథెలియం అని పిలువబడే ధమనుల లోపలి పొరను దెబ్బతీస్తుంది. ది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

దీనితో పాటు ఎవరికైనా ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయని సంకేతం. వీటిని విస్మరించడం కూడా ఒకొక్కసారి ఖరీదైనది అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)