Rabindranath Tagore: ఠాగూర్ జీవితంలో చాలా మంది మహిళలు.. అయితే అన్న భార్య కాదంబరి మాత్రం వెరీ స్పెషల్..
సుధీర్ కక్కర్ అనే రచయిత రవీంద్రనాథ్‌పై 'యంగ్ ఠాగూర్: ది మేకింగ్ ఆఫ్ ఎ జీనియస్' అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఠాగూర్ బాల్యం, యవ్వనం, ప్రేమ వంటి అనేక విషయాల గురించి చాలా రాశారు.
Rabindranath Tagore Love Story: గత కొన్ని దశాబ్దాల క్రితం వరకూ పెళ్లిళ్లు చాలా చిన్న వయసులోనే జరిగేవి.. అదే విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య యతీంద్రనాథ్‌కి కాదంబరి అనే అమ్మాయితో పెళ్లి అయింది. అప్పుడు యతీంద్రకు 20 ఏళ్లు అయితే.. కాదంబరి పదేళ్లు.. ఇక రవీంద్రనాథ్ కు ఎనిమిదేళ్లే. అంటే అన్న యతీంద్ర భార్య కాదంబరి వయసు.. రవీంద్రనాథ్ ఠాగూర్ వయస్సు దాదాపు సమానం. దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కాదంబరి కూడా మేధావి, ఠాగూర్ కూడా అంతే. వీరి తెలివితేటలు.. స్నేహంగా మారి.. ఒకరికొకరు దగ్గర అయ్యేలా చేసింది. ఠాగూర్ తన సాహిత్యంలో రాసిన శృంగార పద్యాలు, పాటలకు స్ఫూర్తి కాదంబరి అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా పుస్తకాలు రాశారు. అయితే సుధీర్ కక్కర్ అనే రచయిత రవీంద్రనాథ్‌పై ‘యంగ్ ఠాగూర్: ది మేకింగ్ ఆఫ్ ఎ జీనియస్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఠాగూర్ బాల్యం, యవ్వనం, ప్రేమ వంటి అనేక విషయాల గురించి చాలా రాశారు. రవీంద్ర ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం శాంతినికేతన్‌లో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న రోహిత్ కుమార్ ఈ పుస్తకం ఆధారంగా ఠాగూర్ జీవితంలో చాలా మంది మహిళలు వచ్చారని , కాదంబరి ప్లేస్ మాత్రం స్పెషల్ ని చెప్పాడు.
స్వచ్ఛతతో నిండిన ప్రేమ: ఠాగూర్ కవి, రచయిత, నాటక రచయిత, చిత్రకారుడు, గీత రచయిత-సంగీతకారుడు. రవీంద్ర నాథ్ ఓపికతో కూడిన గంభీరమైన వ్యక్తిత్వం, ప్రతిభ అందరినీ ఆకర్షించేది. ముఖ్యంగా మహిళలు అతడిని బాగా ఇష్టపడేవారు.. ప్రేమలో పడేవారని రోహిత్ కుమార్ పేర్కొన్నాడు. కాదంబరి పెళ్లి తర్వాత తన అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు.. ఆమె తన చదువును కొనసాగించాలని కోరుకుందని రోహిత్ చెప్పాడు. ఆమె ఎప్పుడూ సరదాగా సంతోషంగా గడపాలని కోరుకునేది. అయితే ఆమె తీసుకునే నిర్ణయాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పాడు. నాటకాలు, పద్యాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. దీంతో కాదంబరి రవీంద్రల స్నేహం కూడా గాఢంగా సాగింది.
కోల్‌కతాకు చెందిన పండితుడు తితిర్ గుహ ఇలా వ్రాశాడు, “యతీంద్రనాథ్ ICS అధికారి. తన పని బిజీ వల్ల కాదంబరితో తక్కువ సమయం గడిపేవాడు. అందుకే కాదంబరి రవీంద్రతో ఎక్కువ సమయం గడిపేది. ఇద్దరి మధ్య అనుబంధం.. స్నేహం కంటే ఎక్కువగా మారింది. ముఖ్యంగా ఠాగూర్ తల్లి చనిపోయినప్పుడు.. కాదంబరి తన మరిది రవీంద్రకు సంరక్షకురాలిగా మారింది. ఆమె అతనికంటే రెండేళ్ళు పెద్దది. రవీంద్ర మీద చాలా ఆప్యాయత, ప్రేమను కురిపించింది.
ఠాగూర్ కూడా ఆమె ప్రేమలో పడటం ప్రారంభించాడు. ఠాగూర్ స్వరపరిచిన ప్రేమగీతాలు ,స్త్రీల పెయింటింగ్స్ అన్నీ కాదంబరిని ఊహించుకునే రచించారు. ఈ విషయాన్నీ రవీంద్ర నాథ్ కూడా అంగీకరించారు. ఠాగూర్ వివాహం చేసుకున్నారు.. అయినప్పటికీ కాదంబరితో అతని ప్రేమ పూర్తిగా స్వచ్ఛమైందని అంటారు.
కాదంబరి వల్ల రవీంద్ర పెళ్లి చెడిపోయింది సుధీర్ కక్కర్ తన ‘యంగ్ ఠాగూర్’ పుస్తకంలో రవీంద్రనాథ్ వివాహం ఫిక్స్ అయినప్పుడు, కాదంబరి షాక్ అయిందని పేర్కొన్నాడు. రవీంద్రకు పెళ్లి కావడం ఆమెకు ఇష్టం లేదు. దీంతో అతడి పెళ్లి చెడగొట్టడానికి కూడా ప్రయత్నించింది. రవీంద్ర పెళ్లి చేసుకోను అని చెప్పాలని ఒత్తిడి తెచ్చింది.
రవీంద్ర పెళ్లి అయితే తనకు రవీంద్రకు మధ్య దూరం వస్తుందని కాదంబరి భావించింది. కృష్ణ కృపలానీ రచించిన ‘ఠాగూర్ ఎ లైఫ్’ పుస్తకం ప్రకారం రవీంద్రనాథ్ .. కాదంబరిని అడగకుండా ఏపనిని అయినా చేసేవాడు కాదు.. అయితే కాదంబరి ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడు రవీంద్రనాథ్. దీంతో కాదంబరి తీవ్ర నిరాశకు గురైంది. రవీంద్ర నాథ్ కు పెళ్లయిన నాలుగు నెలలకే నల్లమందు తిని మరణించింది. ఈ ఘటన అప్పట్లో పశ్చిమ బెంగాల్‌లో పెను సంచలనం సృష్టించింది. వదిన కాదంబరి మరణంతో ఠాగూర్ కూడా షాక్ తిన్నారు.
దీని ప్రభావం ఠాగూర్ దాంపత్య జీవితంపై పడింది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. ఠాగూర్ భార్య ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య అనుబంధం స్నేహపూర్వకంగా మారింది. రవీంద్ర నాథ్ భార్య ఇంగ్లాండ్‌లో చదువుకుంది. కొన్ని పుస్తకాలను అనువదించింది. ఇద్దరికీ ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఠాగూర్ జీవితంలోకి చాలా మంది మహిళలు వచ్చారు, అతను ఆ మహిళలతో ప్రేమలో పడ్డాడు. అయినప్పటికీ రవీంద్ర నాథ్ కు కాదంబరితో ఉన్న ప్రేమ భిన్నం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..