AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఒక్క యూట్యూబ్ వీడియో మొత్తం జీవితాన్ని మార్చేసింది.. చదివింది 8వ తరగతి.. ఏడాదిలో కోటి రూపాయల సంపాదన .. ఎలాగంటే!

అయితే ఓ సారి యూట్యూబ్‌లో వీడియోను స్క్రోల్ చేస్తున్న సమయంలో అతని కంట పడిన ఓ దృశ్యం.. అతని జీవితాన్నే మార్చేసింది. తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు గురించి వీడియో ద్వారా తెలుసుకున్నాడు.

Success Story: ఒక్క యూట్యూబ్ వీడియో మొత్తం జీవితాన్ని మార్చేసింది.. చదివింది 8వ తరగతి.. ఏడాదిలో కోటి రూపాయల సంపాదన  .. ఎలాగంటే!
Papaya Farmer Sucess Story
Surya Kala
|

Updated on: Aug 07, 2022 | 2:52 PM

Share

Success Story: ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది..ఇది యాడ్ క్యాప్షన్ మాత్రమే కాదు.. కొన్ని సార్లు జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. ఇందుకు సజీవ సాక్ష్యం 8వ తరగతి మాత్రమే చదివి ఓ రైతు. యూట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఓ చిన్న ఆలోచనను ఆచరణలో పెట్టి.. లక్షల్లో సంపాదిస్తూ.. ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు రాజస్థాన్ కు చెందిన ఓ రైతు.. జాలోర్ జిల్లా పల్దీ గ్రామాని గ్రామానికి చెందిన భావరామ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలీగా పనిచేసేవాడు. ఎపుడు చేసే పని విషయంలో బద్ధకించేవాడు కాదు.. కష్టపడి పనిచేసేవాడు. అయినప్పటికీ భావరామ్ వేతనం చాలా తక్కువగా ఉండేది. అతని ఖర్చులకు ఏ మాత్రం సరిపోయేది కాదు.  అయితే ఓ సారి యూట్యూబ్‌లో వీడియోను స్క్రోల్ చేస్తున్న సమయంలో అతని కంట పడిన ఓ దృశ్యం.. అతని జీవితాన్నే మార్చేసింది.  అప్పుడే అతడికి జీవితాన్ని మార్చే ఆలోచన వచ్చింది. తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు గురించి వీడియో ద్వారా తెలుసుకున్నాడు. దీంతో ఆ బొప్పాయి గురించి మరింత వివరాలను తెలుసుకోవాలని.. యూట్యూబ్‌లో తైవాన్ రెడ్‌ లేడీ వెరైటీకి చెందిన మరికొన్ని వీడియోలను చూశాడు. అప్పుడు తక్కువ ఖర్చుతో అత్యంత లాభదాయకమైన వ్యవసాయం అని తెలిసింది. ఈ రకం బొప్పాయిలో మొదటి మూడు రకాల్లో ఒకటిగా నిలిచింది.

ఇదే విషయం పై భవరామ్ స్పందిస్తూ.. తనకు కూలికి వేతనంగా ఇచ్చే డబ్బులు సరిపోయేవి కావని.. ఒకొక్కసారి అసలు పనులు మానేయాలని కూడా అనుకున్నట్లు చెప్పాడు భవరామ్. అయితే తాను కూలికి వెళ్లకపోతే రోజు గడవడం ఎలా అని ఆలోచించి  ఇష్టం లేకపోయినా కూలి పనులకు వెళ్ళేవాడినని చెప్పాడు. అప్పుడు తనకు తైవాన్ రెడ్‌ లేడీ బొప్పాయి వ్యవసాయం చేయాలనే కోరిక కలిగినట్లు చెప్పాడు. దీంతో గుజరాత్‌లో తైవాన్ రకం బొప్పాయి గురించి విచారించి ఇక్కడ దొరుకుతుందని కన్ఫామ్ చేసుకున్నట్లు చెప్పాడు భావరామ్.

తైవాన్ బొప్పాయి సాగు చేయాలనుకుని.. తిరిగి స్వగ్రామమైన పల్దీకి తిరిగి వచ్చి ఒక్కో మొక్కకు రూ.25 చొప్పున 2500 మొక్కలను కొనులు చేశాడు. 2021ఏడాది జూన్-జూలై నెలల మధ్య 2.35 హెక్టార్ల భూమిలో తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగును ప్రారంభించాడు. డ్రిప్ విధానం, సేంద్రియ ఎరువుతో ముందుగా పొలాన్ని సిద్ధం చేశారు. మొక్కలు నాటిన 6 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభమైంది. ఏడాదిలో భవరామ్ ఆదాయ పరిస్థితి మారిపోయింది. ఏడాదిలో రూ.కోటి విలువైన బొప్పాయిలను విక్రయించినట్లు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మొదట్లో తాను పండించిన బొప్పాయికి మంచి లాభాలు వస్తాయని మార్కెట్‌లో విక్రయించేందుకు మార్కెట్ ను ఆశ్రయిస్తే.. అప్పుడు కనీసం   గిట్టుబాటు ధర రాలేదని రైతు వాపోయాడు. దీంతో ఇంటి దగ్గరే బొప్పాయి పండ్లను విక్రయించడం ప్రారంభించాడు. ట్రాక్టర్ ట్రాలీలో బొప్పాయిలను నింపుకుని రోడ్డు పక్కనే నిలబడతానని చెప్పాడు. క్రమంగా ప్రజలు తాను పాడించిన బొప్పాయి రుచికి ఇష్టపడడం ప్రారంభించడంతో ఒక రోజులో 5 క్వింటాళ్ల బొప్పాయిలను విక్రయించినట్లు చెప్పాడు. ఇప్పుడు జలోర్ జిల్లాలో ఈ బొప్పాయిలను ‘భావరంస్ బొప్పాయి’ పేరుతో విక్రయిస్తున్నారు.

బొప్పాయి సాగుతో తన అదృష్టమే పూర్తిగా మారిపోయిందని స్వయంగా భవరాం నమ్ముతున్నాడు. రూ.25 విలువైన మొక్క అతడిని సంపన్నుడిని చేసింది. 2500 మొక్కలు రూ.62500లకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు సమీపంలోని రైతులకు కూడా బొప్పాయి సాగు విషయంలో శిక్షణ ఇస్తున్నాడు. తనతోపాటు మరికొందరి అన్నదాతలకు అండగా నిలబడుతున్నాడు.

మరిన్నిహ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..