AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wifi: రాత్రిపూట వైఫై ఆన్ చేసి పడుకుంటే ఏమవుతుందో తెలిస్తే షాకే..

ఈ డిజిటల్ యుగంలో ఇంట్లో వైఫై తప్సనిసరిగా మారింది. ఇంట్లో కొద్ది సేపు వైఫై రాకపోతే దిక్కుతోచని పరిస్థితి. వర్క్ ఫ్రమ్ హోం చేసే వారి పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంటుంది. అయితే రాత్రిపూట వైఫై ఆఫ్ చేయకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?

Wifi: రాత్రిపూట వైఫై ఆన్ చేసి పడుకుంటే ఏమవుతుందో తెలిస్తే షాకే..
Why You Should Turn Off Wi Fi At Night
Krishna S
|

Updated on: Sep 20, 2025 | 10:24 PM

Share

మన జీవితంలో వైఫై అనేది ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. కొద్దిసేపు వైఫై ఆగిపోయినా ఆగమాగం అవుతాం. అయితే రాత్రిపూట వైఫై ఆన్ చేసి పడుకోవడం సరైనదేనా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట వైఫై ఎందుకు ఆఫ్ చేయాలి?

చాలామందికి రాత్రిపూట సరైన నిద్ర పట్టకపోవడం, ఉదయం లేవగానే అలసటగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి కారణం మీ పక్కనే ఉండే వైఫై రౌటర్ కావచ్చునని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వైఫై నుంచి వచ్చే సిగ్నల్స్ మన నిద్రను ప్రభావితం చేస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి.

నిద్రపై ప్రభావం: 2024లో ఆస్ట్రేలియాలోని RMIT విశ్వవిద్యాలయం చేసిన ఒక నివేదిక ప్రకారం.. వైఫై దగ్గర నిద్రించే వారిలో 27 శాతం మందికి నిద్రలేమి సమస్య ఉందని తేలింది. అలాగే 2021లో ఎలుకలపై చేసిన ఒక పరీక్షలో, వైఫై సిగ్నల్స్ గాఢనిద్రను తగ్గిస్తాయని కనుగొన్నారు.

ఆరోగ్యానికి లాభాలు: వైఫైను రాత్రిపూట ఆఫ్ చేయడం వల్ల మీ మెదడుకు విశ్రాంతి లభించడంతో పాటు నిద్ర బాగా పడుతుంది. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

విద్యుత్, డేటా ఆదా: రాత్రిపూట వైఫై ఆఫ్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా, విద్యుత్, ఇంటర్నెట్ డేటా కూడా ఆదా అవుతాయి. అలాగే రౌటర్‌కు విశ్రాంతి లభించడం వల్ల దాని జీవితకాలం కూడా పెరుగుతుంది.

వైఫై ఆఫ్ చేయకూడదు అనుకుంటే..

ఒకవేళ మీ ఇంట్లో CCTV కెమెరాలు, స్మార్ట్ లైట్లు వంటివి ఉంటే రాత్రిపూట వైఫై ఆఫ్ చేయడం వల్ల అవి పనిచేయవు. ఇలాంటి సందర్భాల్లో ఒక మంచి పరిష్కారం ఉంది. మీ వైఫై రౌటర్‌ను బెడ్‌రూమ్‌లో కాకుండా దాని బయట పెట్టడం మంచిది. దీనివల్ల రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది. వైఫై రేడియేషన్ వల్ల నేరుగా పెద్దగా హాని ఉండకపోయినా మంచి నిద్ర, ఆరోగ్యానికి రాత్రిపూట దాన్ని ఆఫ్ చేయడం ఒక మంచి అలవాటు. ఇది చిన్న మార్పు అయినా మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..