అరటి పండు వంకరగా ఎందుకు ఉంటుందో తెలుసా?
అరటి పండు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ అరటి పండు తెలుసు. చాలా టేస్టీగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అందుకే చాలా మంది అరటి పండును ఎక్కువగా తింటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? అరటి పండు అనేది వంకరగా ఉంటుంది. మరి అసలు అరటి పండు వంకరగా ఎందుకు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
Updated on: Sep 21, 2025 | 4:16 PM

అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్ కూడా ఉంటుంది. అలాగే ఇవి అలసట, బలహీనతను తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే చాలా మంది అరటి పండు తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. మరీ ముఖ్యంగా ఉందయం బ్రేక్ ఫాస్ట్‌లో అరటి పండు తినడం చాలా మంచిదంటారు.

మనసుకు కూడా అరటి ఆహ్లాదం కలిగిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ నొప్పి, వాపులను తగ్గించి.. మొత్తంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను క్రమబద్ధం చేస్తుంది.

అరటిపండు మూత్రపిండాల్లో సమస్యలను నివారిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకుంటే నీరసం తగ్గి, తక్షణ శక్తి వస్తుంది. ఇంత మేలు చేసే అరటిపండు ఎంతో రుచిగా కూడా ఉంటుంది కనుక ఇష్టంగానే తినేయొచ్చు.

అరటి పండ్లు వంకరగా ఉండటానికి కారణం ఉన్నదంటున్నారు సైంటిస్ట్‌లు. కాగా అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లు , ఈ చెట్లు సూర్యకాంతిని ఎక్కువగా ఆకర్షిస్తాయంట. ఈ మొక్కలు సూర్యకాంతి వైపు తమ పెరుగుదలను జరుపుతుంటాయంట. ముఖ్యంగా అరటి పండ్లు పెరిగే కొద్దీ సూర్య ర్శ్మి వైపు తిరుగుతాయంట.

ముఖ్యంగా అరటి పండ్లు వంకరగా ఉండటానికి ఫోటో ట్రోపిజం కారణం అంటున్నారు శాస్త్ర వేత్తలు. ఎందుకంటే అరటి పండ్లలోని కణాలు సూర్యరశ్మి వైపు తిరగడం ప్రారంభిస్తాయంట. అలా అరటి పండ్లు పైకి పెరిగి, నెమ్మదిగా వంగుతాయంట. అందువలన ఇవి వంకరగా ఉంటాయంట. దీనిని నెగటివ్ జియోట్రోపిజం అంటున్నారు శాస్త్రవేత్తలు. దీని వలనే అరటి పండ్లు కాస్త వంకరగా ఉంటాయంట.



