Brain Health Foods: మతి మరుపుకు చెక్ పెట్టాలా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి!

మతిమరుపు లేని మనిషి అంటూ ఎవరూ ఉండరు. ఏదో ఒక సందర్భంగా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అదే విధంగా ఒక్కోసారి చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఈ సమస్య కేవలం వయసు పైబడిన వాళ్లకే ఉండేది. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ వస్తుంది. మెమరీ పవర్ తగ్గితేనే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. మతిమరుపును నిర్లక్ష్యం చేస్తే అల్జీమర్స్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే మీ మెమరీ పవర్‌ను..

Brain Health Foods: మతి మరుపుకు చెక్ పెట్టాలా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి!
Brain
Follow us
Chinni Enni

|

Updated on: Jan 29, 2024 | 2:18 PM

మతిమరుపు లేని మనిషి అంటూ ఎవరూ ఉండరు. ఏదో ఒక సందర్భంగా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అదే విధంగా ఒక్కోసారి చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఈ సమస్య కేవలం వయసు పైబడిన వాళ్లకే ఉండేది. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ వస్తుంది. మెమరీ పవర్ తగ్గితేనే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. మతిమరుపును నిర్లక్ష్యం చేస్తే అల్జీమర్స్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే మీ మెమరీ పవర్‌ను పెంచుకోండి. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా.. మీ బ్రెయిన్ పవర్‌ పెంచుకోవాంటే ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పని లేదు. హ్యాపీగా కొన్ని రకాల ఫుడ్స్ తింటే సరిపోతుంది. ఇవి తినడం వల్ల అభిజ్ఞా అభివృద్ధి చెందుతుంది. ఇవి మన జ్ఞాపకశక్తిని బాగా పెంచుతాయి. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూసేయండి.

చేపలు:

చాలా మందికి చేపలు అంటే ఇష్టం ఉండదు. అందుకు కారణం ముల్లు ఉంటాయని. కానీ కాస్త శ్రమ తీసుకుని తింటే మీకే మంచిది. ఎందుకంటే చేపల్లో ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమవుతాయి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. కొవ్వు చేపలను తినడం వల్ల అభిజ్ఞా పని తీరు మెరుగు పడుతుంది. దీంతో మీ మతిమరుపు ఎగిరిపోతుంది.

బ్రోకలీ:

ప్రస్తుతం ఈ బ్రోకలీ చిన్న పల్లెటూర్లలో కూడా లభ్యమవుతుంది. కాబట్టి ఈ సారి కనిపిస్తే వెంటనే కొని.. శుభ్రంగా వాష్ చేసి తినండి. దీని వల్ల కేవలం మెదడు యాక్టీవ్ అవడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. బ్రోకలీని సలాడ్స్‌లో కానీ లేదా బ్రేక్ ఫాస్ట్‌లో అయినా యాడ్ చేసుకుని తింటే చాలా మంచిది. బ్రోకలీ తింటే జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది.

ఇవి కూడా చదవండి

డార్క్ చాక్లెట్:

చాలా మంది చాక్లెట్స్‌ని ఇష్ట పడి తింటారు. అలాంటి వారు డార్క్‌ చాక్లెట్ తింటే ఇంకా మంచిది. ఇందులో కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది జ్ఞాపక శక్తి, అభిజ్ఞా అభివృద్ధిని మెరుగు పరుస్తుంది.

పసుపు:

పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియాగా చెప్పుకుంటాం. అందుకే అన్ని వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో వ్యాధి నిరోధక శక్తి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదే విధంగా పసుపు తింటే జ్ఞాపకశక్తి, మెదడు ఆరోగ్యం బాగుంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.