AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water: కొబ్బరి నీరుని రోజూ ఇలా తాగండి.. ఎన్నో ప్రయోజనాలో తెలుసా..

వేసవికాలంలో శరీరం డీహైడ్రేట్ బారిన పడకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లను తినే ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కొబ్బరి నీరు దాహార్తిని తీరుస్తుంది. ఇది సహజ ఎలక్ట్రోలైట్. కనుక కొబ్బరి నీరుని తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఈ రోజు వేసవిలో ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.

Coconut Water: కొబ్బరి నీరుని రోజూ ఇలా తాగండి.. ఎన్నో ప్రయోజనాలో తెలుసా..
Coconut WaterImage Credit source: getty
Surya Kala
|

Updated on: Apr 21, 2025 | 10:36 AM

Share

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తగినంత మంచి నీరుని తాగడంతో పాటు సహజమైన ఆరోగ్యకరమైన పానీయాలను తాగడం కూడా మంచిది. ఈ సీజన్‌లో కొబ్బరి నీళ్లు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. సహజ ఎలక్ట్రోలైట్ కావడంతో కొబ్బరి నీరు తక్షణ శక్తిని ఇస్తాయి. అంతేకాదు శరీరంలోని pH సమతుల్యతను కాపాడడంలో కూడా సహాయపడతాయి. యునైటెడ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం కొబ్బరి నీటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సహజ చక్కెర, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్, రాగి, మాంగనీస్, విటమిన్ సి, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, B6, ఫోలేట్ వంటి పోషకాలున్నాయి.

వేసవిలో కొబ్బరి నీళ్లను తినే ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అంతేకాదు కొబ్బరి నీరు తాగడం ఇతర సీజన్లలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. శారీరక శక్తిని పెంచడమే కాదు వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. రోజూ ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

చర్మం సహజంగా మెరుస్తుంది: ప్రతిరోజూ ఉదయం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ ఉంటుంది. విటమిన్ సితో సహా దానిలో ఉండే పోషకాలు కొల్లాజెన్‌ను పెంచడానికి కూడా పనిచేస్తాయి. ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. దీంతో చర్మం సహజంగా ప్రకాశవంతంగా ఉంటుంది. చర్మంపై ముడతలు, గీతలు, మొటిమల వంటి సమస్యల నుంచి రక్షించబడుతుంది.

ఇవి కూడా చదవండి

వడ దెబ్బ నుంచి రక్షణ: ప్రతి రోజూ ఉదయం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ .. నీటి సమతుల్యతను కాపాడటానికి పనిచేస్తుంది. తద్వారా వడ దెబ్బ నుంచి రక్షిస్తుంది.

సజావుగా జీర్ణక్రియ: కొబ్బరి నీరులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కనుక ఉబ్బరం, అజీర్ణం, ఆమ్లత్వం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ప్రతి ఉదయం క్రమం తప్పకుండా తాగడం వల్ల పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మూత్రపిండాలకు ప్రయోజనాలు: ప్రతి రోజూ ఉదయం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. మూత్రపిండాలను, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు నియంత్రణలో సహాయం: తరచుగా కొబ్బరి నీళ్లు తాగే ఫిట్‌నెస్ ఫ్రీక్‌లను చూసి ఉంటారు. నిజానికి ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీవక్రియ కూడా పెరుగుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర, రక్తపోటు నియంత్రణ: ప్రతి ఉదయం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు జరుగుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కొబ్బరి నీళ్లు తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, తక్కువ రక్తపోటు ఉన్నవారు కొబ్బరి నీరు తాగవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)