Mystery temple: ఆలయం నిర్మిస్తుండగా చెరువులోకి దూకిన శిల్పి.. ఎన్నో రహస్యాలకు నెలవు.. నేటికీ పూర్తికాని శివాలయ నిర్మాణం.. ఎక్కడంటే
ఛత్తీస్‌గఢ్‌ను పూర్వ కాలంలో దక్షిణ కోసల రాజ్యం అని పిలిచేవారు. కాలం మారింది.. నాగరికత మారింది.. కానీ అప్పటి నాగరికతకు చెందిన గుర్తులు ఇప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడ పురాతన ప్రదేశాలు ఇప్పటికీ అలనాటి ప్రజల జీవన విధాన్ని వైభవానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సంతాన ధర్మం పై ఉన్న విశ్వాసం, చరిత్ర కథను చెప్పే ఒక ప్రదేశం దుర్గ్ దేవ్‌బలోడాలోని మహాదేవ ఆలయం. ఈ ఆలయం కళ, చరిత్ర, విశ్వాసంల గొప్ప సంగమం.

ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలోని దేవ్‌బలోడాలో ఉన్న ఈ పురాతన శివాలయం భక్తులకు విశ్వాసం కేంద్రంగా ఉంది. ఇక్కడ శివయ్య స్వయంభువుగా వెలసినట్లు నమ్మకం. ఈ మహాదేవ శివాలయం కళ… చరిత్ర… విశ్వాసంల సంగమం. ఈ ఆలయం ప్రజల విశ్వాసాలకు నిలయం. కాలం మారింది కానీ ప్రజల నమ్మకం మారలేదు. సంవత్సరాలు గడిచాయి కానీ ఇక్కడ భక్తుల రద్దీ తగ్గలేదు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి పర్వదినం రోజున భారీ సంఖ్యలో భక్తులు మహాదేవుడి దర్శనం కోసం చేరుకుంటారు. భక్తులు భారీగా క్యూ కడతారు. ఆలయ ప్రాంగణం శివయ్య నామ స్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు విశ్వాసంతో శిరసు వంచి శివయ్యను కొలుస్తారు. బోలాశంకరుడికి రక్షణగా ఇక్కడ పాములు ఉంటాయని స్థానికులు చెబుతారు.
దీనిని ఖజురహోతో పోల్చారు.
ఈ అద్భుతమైన విశ్వాస ప్రదేశం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్ బలోడాలోని దట్టమైన అడవుల మధ్య ఉంది. ఇది 13వ శతాబ్దపు శివాలయం అని.. దీనిని కల్చురి రాజులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయాన్ని పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా ప్రకటించారు. ఈ ఆలయాన్ని భోరమదేవ ఆలయం, ఖజురహో గుహలతో పోల్చారు. ఈ ఆలయంలోని శివలింగం భూమి నుండే స్వయంగా ఉద్భవించిందని నమ్ముతారు.
గుడి పనివాడు చెరువులోకి దూకాడా?
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు శివయ్యను దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ ఆలయానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి నగ్నంగా ఉండి.. ఆలయాన్ని నిర్మించాడని ఒక పౌరాణిక నమ్మకం ఉంది. శిల్పి భార్య ఎప్పుడూ అతనికి ఆహారం తెచ్చేది.. అయితే ఆరవ నెలలో ఒక రాత్రి, శిల్పి భార్యకు బదులుగా.. అతని సోదరి అకస్మాత్తుగా ఆహారం తెచ్చింది. నగ్నంగా ఉన్న అన్న చెల్లెల్ని చూసి శిల్పి కుండంలోకి దూకాడు. తన సోదరుడు చెరువులోకి దూకడం చూసిన సోదరి కూడా ఆలయం పక్కనే ఉన్న చెరువులోకి దూకింది. ఆ చెరువును కసారా చెరువు అని పిలుస్తారు ఎందుకంటే ఆమె తన సోదరుడికి ఆహారం తెచ్చినప్పుడు..ఆమె తలపై ఆహారంతో పాటు ఒక కుండ నీరు కూడా ఉన్నదట.
ఆలయం ఇంకా అసంపూర్ణంగా ఉంది
ఈ చెరువు, కుండం ఇప్పటికీ ఈ ఆలయంలో ఉంది. ఇది ప్రజలకు ఆకర్షణ కేంద్రంగా ఉంది. శిల్పి దూకినందున ఆలయ పని పూర్తి కాలేదని.. పై భాగం నేటికీ అసంపూర్ణంగా ఉన్నందున… ఈ అన్నా చెల్లెలుకి సంబంధించిన సంఘటన జరిగినట్లు ఆధారాలు కూడా దొరికాయని చెబుతారు.
ఆలయం లోపల ఒక రహస్య సొరంగం ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలయ సముదాయంలో నిర్మించిన చెరువు లోపల ఒక రహస్య సొరంగం ఉంది, ఇది నేరుగా అరంగ ఆలయానికి దారితీస్తుంది. ఆలయ చెరువు 12 నెలల పాటు నీటితో నిండి ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. దేవబలోడాలోని ఈ మహాదేవ ఆలయం కళ, విశ్వాసానికి నిలయంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








