AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JD Vance India Tour: మరికాసేపట్లో భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..

అమెరికా నుంచి భారత్‌ పర్యటనకు వస్తున్నారు ఆంధ్రా అల్లుడు.. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో కలిసి మరకాసేపట్లో ఇండియాలో ల్యాండ్ అవ్వనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు వాన్స్‌ దంపతులు. ఈ రోజు ప్రధాని మోదీతో సమావేశంకానున్నారు జేడీ వాన్స్‌

JD Vance India Tour: మరికాసేపట్లో భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..
Jd Vance Begins 4 Day India Visit Today
Surya Kala
|

Updated on: Apr 21, 2025 | 8:20 AM

Share

భారత్‌ పర్యటనకు ముందు వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్. ఈ భేటీలో యుద్ధం, సంక్షోభాలు, వలసదారులు, శరణార్థులు గురించి చర్చించారు. అలాగే పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఐతే వలసల విషయంలో ట్రంప్‌ను విభేదించిన పోప్‌తో వాన్స్‌ భేటీకావడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన సతీమణి ఉషా తో కలిసి భారత్‌కు రానున్నారు. నాలుగు రోజుల పాటు భారత్‌లో వాన్స్‌ దంపతుల పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.

నేడు ప్రధాని మోదీతో జేడీ వాన్స్‌ సమావేశంకానున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక సంబంధాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికా టారీఫ్‌లపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి జేడీ వాన్స్‌ దంపతులకు మోదీ విందు ఇవ్వనున్నారు. ఈ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా వాన్స్ ఢిల్లీ, యూపీ, రాజస్థాన్‌లో పర్యటించనున్నారు.

మరోవైపు అచ్చ తెలుగమ్మాయి.. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ సతీమణి ఉషకు అరుదైన కానుకని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఉషావాన్స్‌కు మెమెంటో ఇవ్వనునుంది కేంద్ర రైల్వేశాఖ. ఈ మెమెంటోను ఉషావాన్స్ కు స్వయంగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బహూకరించనున్నారు. ఉషావాన్స్ కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా సాయిపురంలో ఉన్నాయి. 1970లో ఉషావాన్స్ తల్లిదండ్రులు అగ్రరాజ్యం అమెరికాకు వలసవెళ్ళారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు కుటుంబసమేతంగా ఇండియా వస్తున్న వాన్స్‌ దంపతులు ఏపీకి రావాలంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు ప్రజలు. ఉషా వాన్స్.. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్. దీంతో పూర్వీకులు నివసించిన వడ్లూరును సందర్శిస్తారని ఆశిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. 80ఏళ్ల క్రితం గ్రామ అభివృద్ధిలో ఉషా వాన్స్ కుటుంబం కీలక పాత్ర పోషించిందని.. చాలా మందికి విద్య అవకాశాలను కల్పించిందని చెబుతున్నారు గ్రామస్తులు. ఎలాగైనా జేడి వాన్స్ కుటుంబం వడ్లూరు సందర్శించేల చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..