AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ ఎక్కడంటే..

మనుషులకు జరిగే మంచి చెడులను అంచనా వేసేందుకు కొంతమంది జోతిష్యశాస్త్రాన్ని నమ్ముతారు. మరికొందరు న్యూమరాలజీని నమ్ముతారు. అదే విధంగా ప్రపంచంలో జరిగే జరుగుతున్న.. జరగనున్న సంఘటనలు అంచనా వేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, బాబా వంగా, నోస్ట్రాడమస్ వంటి వారు ప్రపంచంలో జరిగే సంఘటనలు, మానవుల ప్రవర్తనను ముందే అంచనావేశారు. తాజాగా జరుగుతున్న సంఘటలు నిజమే కొని వందల ఏళ్ల క్రితమే బాబా వంగా చెప్పారు.. ముఖ్యంగా 2025 జూలై నెల గురించి బాబా వంగా వేసిన అంచనా ఇదే అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Baba Vanga: భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ ఎక్కడంటే..
Baba Vangas 2025 Predictions
Surya Kala
|

Updated on: Apr 21, 2025 | 8:01 AM

Share

ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనల గురించి బాబా వంగా ముందే అంచనా వేసింది.. ఆమె ఎప్పుడో చెప్పింది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో బాబా వంగ జ్యోసం ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆమె చెప్పిన విషయాలు 9/11 దాడులు, ఆఫ్ఘనిస్థాన్ ఆపరేషన్, కోవిడ్-19 మహమ్మారి, యుద్ధాలతో పాటు ఇటీవల సంభవించిన జపాన్ లో సునామీ వంటివి నిజమయ్యాయి. దీంతో బాబా వంగా ఏమి చెప్పినా అది నిజం అవుతుందని నమ్ముతున్నారు. రానున్న రోజుల గురించి ఆమె ఏమి చెప్పింది అని దృష్టి సారించడం మొదలు పెట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా బాబా వంగగా ప్రసిద్దిగాంచిన ఈమె అసలు పేరు వంగేలియా పండేవా సర్చేవా. అక్టోబర్ 3, 1911లో మెసడోనియాలో జన్మించింది. కొన్ని అనుకోని కారణాలతో చూపు కోల్పోయిన బాబా వంగాకు అప్పటి నుంచి భవిష్యత్ కనిపిచడం మొదలు పెట్టిందని నమ్మకం. దృష్టి లోపం ఉన్న బాబా వంగా భవిష్యత్తును అద్భుతంగా చెప్పేది. ఇప్పుడు ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతున్నాయి. బాబా వంగ 2025 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న పలు విషయాలను ముందే అంచనా వేసి చెప్పారు. అందులో జపాన్ లో భారీ సునామీ ఒకటి. ఈ సుమనీ ప్రభావం జపాన్ పై మాత్రమే కాదని.. మొత్తం ఆసియా దేశాలపై ఉంటుందని ఆమె చెప్పారు. అది నిజం అయింది. దీంతో ఇప్పుడు బాబా వంగా జూలై నెలలో జరగనున్ సంఘటనల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు.

జపాన్ చైనా దేశాల్లో భారీ భూకంపం రానుందని.. దీంతో భారీగా ఆస్థి నష్టం, ఎక్కువ మంది ప్రజలు మరణించే అవకాశం ఉందని బాబా వంగా అంచనా వేసినట్లు జపాన్ అధికారులు కొంతమంది చెబుతున్నారు. ఇది కూడా నిజం అయ్యే అవకాశం ఉందని.. అందుకనే ముందుగా ఈ దేశాలు చర్యలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరికొందరు బాబా వంగా చెప్పినవి అన్నీ నిజం అవ్వాలని లేదు. ఇప్పటికే చాలా జరగలేదు కనుక.. ఈ ప్రకృతి వైపరీత్యం కూడా నిజం అయ్యే అవకాశం లేదని జూలై నెలలో సునామీ వచ్చే అవకాశం లేదు అంటూ అంటున్నారు. బాబా వంగా చెప్పింది నిజం అవుతుందా లేదా అనేది పక్కకు పెట్టి.. అధికారులు ఎటువంటి విపత్తి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కొంతమంది సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు