Chandanotsavam: సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు.. ఈనెల 24 నుంచి చందనం అరగదీత ప్రారంభం..
సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి సర్వం సిద్ధం అవుతుంది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 24న సింహగిరిపై గంధం అరగదీసేందుకు శ్రీకారం చుట్టనున్నారు. చందనోత్సవం సందర్భంగా వైశాఖ శుద్ధ తదియ రోజున అప్పన్నస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం స్వామివారికి చదనం సమర్పించనున్నారు.

సింహాచలం వారి చందనోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ప్రధాన ఘట్టమైన చందనం పూసే కార్యక్రమం కోసం.. చందనం చెక్కలను సిద్ధం చేశారు ఆలయ అధికారులు. ఈనెల 24 నుంచి చందనం అరగదీత ప్రారంభిస్తారు. ప్రత్యేక పూజ నిర్వహించి గంధపు చెక్కల నుంచి చందనం తీసే ప్రక్రియను మొదలు పెడతారు. అక్షయ తృతీయ సందర్భంగా.. చందనోత్సవములో స్వామి వారి నిజరూప దర్శనం తర్వాత మూడు మణుగుల చందనాన్ని స్వామి వారికి సమర్పిస్తారు. మూడు మణుగులు అంటే స్వామివారికి దాదాపు 120 కిలోల చందనం సమర్పణ జరుగనున్నది
ప్రతి సంవత్సరం అక్షతలు రోజు సింహాచలంలో స్వామివారి చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఎందుకోసం నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. స్వామివారికి చందనపు పోతన పూసినకు అవసరమయ్యే గంధపు చెక్కలను.. తమిళనాడు నుంచి తెప్పిస్తారు. జాజి పోకల అనే మేలు రకం గంధాన్ని స్వామివారి కోసం వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్దిరోజుల ముందు నుంచి ప్రత్యేక పూజలు చేసే గ్రంథపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను శాస్రోక్తంగా ప్రారంభిస్తారు. ఇందుకోసం చందనపు చెక్కలను సిద్ధం చేశారు. సుగంధ ద్రవ్యాలను కలిపి రంగ తీసిన చందనాన్ని చందనోత్సవం కోసం సిద్ధం చేస్తారు.
అక్షయ తృతీయ ముందు రోజు రాత్రి.. స్వామివారి పై పూసిన చందనాన్ని తొలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామి వారి నిజరూప దర్శనాన్ని భక్తులకు దర్శనం కల్పిస్తారు. అక్షయ తృతీయ రాత్రి వరకు భక్తుల దర్శనం సాగిన తర్వాత స్వామివారికి అభిషేకం మొదలవుతుంది. సింహాచలం గంగ ధార నుంచి వెయ్యి కలశలతో తీసుకొచ్చి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామివారికి చందనం లేపనం పూస్తారు. మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆ చదరం పూసిన తర్వాత స్వామివారు మళ్లీ నిజరూపం నుంచి నిత్య రూపంలోకి మారుతారు.
ఈ చందనపు పూత క్రతువు ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తారు. అక్షయ తృతీయతో పాటు, వైశాఖి పౌర్ణమి, జేష్ట పౌర్ణమి, ఆషాడ పౌర్ణమి రోజుల్లో మూడేసి మనుగుల చొప్పున చందనాన్ని స్వామి వారికి సమర్పిస్తారు. చందనోత్సవం సందర్భంగా స్వామి వారి నుంచి తీసిన 500 కిలోల చందనాన్ని అక్షయ తృతీయ సందర్భంగా భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








