Interesting Facts: గర్భం ధరించిన స్త్రీలు పైనాపిల్ తినకూడదా.. సైన్స్ ఏం చెబుతుందంటే?
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఈ పండు గురించి బాగా తెలుసు. పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభిస్తాయి. కాబట్టి పైనాపిల్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తితో పాటు చర్మం కూడా అందంగా మారుతుంది. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం పైనాపిల్ తినకూడదని చెబుతూ ఉంటారు. దీని వల్ల అబార్షన్ అవుతుందని ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగానే గర్భిణీలు పైనాపిల్..

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఈ పండు గురించి బాగా తెలుసు. పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభిస్తాయి. కాబట్టి పైనాపిల్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తితో పాటు చర్మం కూడా అందంగా మారుతుంది. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం పైనాపిల్ తినకూడదని చెబుతూ ఉంటారు. దీని వల్ల అబార్షన్ అవుతుందని ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగానే గర్భిణీలు పైనాపిల్ తినకూడదా? మరి సైన్స్ ఏం చెబుతుంది? దీని గురించి పోషకాహార నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.
హ్యాపీగా పైనాపిల్ తినొచ్చు..
గర్భం ధరించాక ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులోనే పైనాపిల్ తినకూడదని ఇంట్లోని పెద్దలు చెబుతూ ఉంటారు. గర్భం ధరించినప్పుడు పైనాపిల్ తింటే మంచిది కాదని ఏ పరిశోధన కూడా తేల్చలేదు. ప్రెగ్నెన్సీలో పైనాపిల్ కూడా ఎలాంటి ఆలోచన లేకుండా తినవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలను హ్యాపీగా తినొచ్చు. అధికంగా తీసుకుంటే ఎలాంటి ఆహారం అయినా విషంగా మారక తప్పదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు.
పైనాపిల్ తింటే అబార్షన్ అవుతుందా..
గర్భంతో ఉన్న మహిళలకు రోగ నిరోధక శక్తి అనేది చాలా ముఖ్యం. పైనాపిల్‌లో ఇది ఎక్కువగానే లభిస్తుంది. ఈ పండు తినడం వల్ల ముందస్తు ప్రసవం జరుగుతుందని లేదా అబార్షన్ జరుగుతుందని ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. అలాగే పైనాపిల్‌లో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. బ్రోమలైన్ శరీరంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే పైనాపిల్ తినొద్దని చెబుతారు. కానీ పైనాపిల్‌లో ఉండే బ్రోమలైన్లు వేరు. ఇది గర్భాన్ని ప్రభావితం చేయలేదు. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా పైనాపిల్ తినొచ్చు.
మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, బీన్స్, చేపలు, మాంసం వంటికి తీసుకుంటే.. తల్లికీ బిడ్డకూ చాలా మంచిది. పోషకాహార లోపం కూడా రాకుండా ఉంటుంది. అదే విధంగా నీళ్లు కూడా అధికంగా తాగాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




