Peanut Oil: మీ ఆహారంలో వేరుశెనగ నూనె వాడుతున్నారా..? అయితే ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి!

వేరుశెనగ నూనెలో కూడా యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మంపై ముడతలు పడకుండా కూడా సహాయపడుతుంది. కొన్ని చుక్కల వేరుశెనగ నూనెను ముఖం మరియు మెడ అంతటా అప్లై చేయడం వల్ల నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతలు తొలగిపోతాయి. వేరుశెనగ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వేరుశెనగ నూనెను తలకు ఉపయోగించటం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది, దెబ్బతిన్న జుట్టు కుదుళ్లను పునరుద్ధరించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Peanut Oil: మీ ఆహారంలో వేరుశెనగ నూనె వాడుతున్నారా..? అయితే ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి!
Peanut Oil
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 21, 2023 | 9:40 PM

వేరుశెనగ పోషకాల భాండాగారం. వేరుశెనగ ఆహారంలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ వంటి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేరుశనగల మాదిరిగానే వేరుశనగ నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వేరుశెనగ నూనెను వంట కోసం ఉపయోగిస్తారు. ఇందులో శరీరానికి అవసరమైన మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మీ రోజు వారి ఆహారంలో వేరుశెనగ నూనెను చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు సమృద్ధిగా ఉండే వేరుశెనగ నూనె చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆహారంలో వేరుశెనగ నూనెను చేర్చుకోవడం మధుమేహ రోగులకు మంచిది. అవి సంతృప్త కొవ్వుల కంటే ఎక్కువ అసంతృప్త కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు శనగ నూనెను ఆహారంలో చేర్చుకోవచ్చు. వేరుశెనగ నూనెలో ఉండే ఒలేయిక్ యాసిడ్ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వాటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వేరుశెనగ నూనె చర్మ సంరక్షణలో కూడా మేలు చేస్తుంది. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. శనగ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. అందువల్ల, ఇవి మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

వేరుశెనగ నూనెలో కూడా యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మంపై ముడతలు పడకుండా కూడా సహాయపడుతుంది. కొన్ని చుక్కల వేరుశెనగ నూనెను ముఖం మరియు మెడ అంతటా అప్లై చేయడం వల్ల నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతలు తొలగిపోతాయి.

వేరుశెనగ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వేరుశెనగ నూనెను తలకు ఉపయోగించటం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది, దెబ్బతిన్న జుట్టు కుదుళ్లను పునరుద్ధరించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పాట్నాలో పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ వేడుక.. పోటెత్తిన ఫ్యాన్స్
పాట్నాలో పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ వేడుక.. పోటెత్తిన ఫ్యాన్స్
ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. చెక్ చేయగా !!
బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. చెక్ చేయగా !!
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!