Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Venom: పాము కాటు వేస్తే ప్రాణం పోతుంది…అయితే, విషం తాగితే ఏమవుతుందో తెలుసా?

అయితే, పాము విషాన్ని కూల్‌డ్రింక్‌గా తీసుకుంటే ప్రభావం ఇలాగే ఉంటుందా? ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ వేధికగా చాలా మంది నెటిజన్లు ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, మొన్నటి మొన్న కొందరు సెలబ్రేటీలు పాము విషాన్ని డ్రగ్‌లా వాడుతున్నట్టు సమాచారం రావటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నెట్టింట చాలా మంది పాము విషంపై చర్చకు దిగుతున్నారు. పాము విషం తాగితే ఏమవుతుంది అనే ప్రశ్నకు నిపుణుల సమాధానం మేరకు..

Snake Venom: పాము కాటు వేస్తే ప్రాణం పోతుంది...అయితే, విషం తాగితే ఏమవుతుందో తెలుసా?
Snake Venom
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 21, 2023 | 8:31 PM

పామును చూస్తే ప్రాణం వణికిపోతుందని అంటారు. అవును.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాము ఒకటి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములు ఉన్నాయి. అందులో 25 శాతం మాత్రమే విషపూరితమైనవని చెబుతుంటారు. కింగ్ కోబ్రా ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన పాములలో ఒకటిగా నమ్ముతారు. పాములు మన శరీరంలోకి విషాన్ని ఇంజెక్ట్ చేయడానికి వాటి దంతాలను ఉపయోగిస్తాయి. అప్పుడు పాముల నోటి గ్రంధుల ద్వారా విషం స్రవిస్తుంది. ఒక విషపూరితమైన పాము మనిషిని లేదా ఇతర జీవులను కాటు చేసినప్పుడు అది విషపూరితమైన ప్రోటీన్లు, ఎంజైమ్‌లు, ఇతర పరమాణు పదార్ధాల సంక్లిష్ట మిశ్రమాన్ని మన రక్తప్రవాహంలోకి పంపుతుంది. పాము విషం శరీరంలోని సెల్యులార్ చలనశీలతను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో పాము కాటుకు గురైన బాధితుడిని అసమర్థంగా చేస్తుంది. ఆ వెంటనే పక్షవాతం, అంతర్గత రక్తస్రావం జరగటంతో మరణానికి దారితీస్తుంది. ఇదంతా చాలా మందికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.

అయితే, పాము విషాన్ని కూల్‌డ్రింక్‌గా తీసుకుంటే ప్రభావం ఇలాగే ఉంటుందా? ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ వేధికగా చాలా మంది నెటిజన్లు ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, మొన్నటి మొన్న కొందరు సెలబ్రేటీలు పాము విషాన్ని డ్రగ్‌లా వాడుతున్నట్టు సమాచారం రావటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నెట్టింట చాలా మంది పాము విషంపై చర్చకు దిగుతున్నారు. పాము విషం తాగితే ఏమవుతుంది అనే ప్రశ్నకు నిపుణుల సమాధానం మేరకు.. పాము కాటు ప్రమాదకరం.. కానీ, పాము విషాన్ని తాగాలనుకునే వారికి దాని ఎఫెక్ట్‌ భిన్నంగా ఉంటుంది. ఇంటర్‌నెట్ వినియోగదారుల్లో ఒకరు పాము విషం అనేది ప్రోటీన్-ఆధారిత టాక్సిన్ అని, ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్‌ల సహాయంతో జీర్ణమవుతుందని చెబుతున్నారు.

అలాగే “ఇది కడుపులో విరిగిపోతుందని, జీర్ణక్రియకు సహాయపడుతుందని మరోకరు చెబుతున్నారు. అయితే, ఈ సాహసోపేతమైన ఫీట్‌ని ప్రయత్నించే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అది మీ మరణానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాము విషం మీ రక్తంలోకి చేరినట్లయితే, అది మీ ధమనులలోకి ప్రవేశించి, పాము కాటు తర్వాత జరిగే విధంగా రక్తం గడ్డకట్టడం ప్రారంభిస్తుంది. విషం రక్తంతో కలిస్తే మాత్రం పెను ప్రమాదం తప్పదు. అందువల్ల, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సరైన మార్గదర్శకత్వం లేకుండా ఇటువంటి కార్యకలాపాలు ఎప్పుడూ ప్రయత్నించకూడదు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..