AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Sight : మీ కంటి చూపు మెరుగుపడాలంటే తప్పక తినాల్సిన పండ్లు ఇవి..

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు..అలాంటి కంటి చూపు మెరుగ్గా ఉన్నప్పుడే ప్రపంచాన్ని చూడగలం. కానీ ఈరోజుల్లో చాలా మందికి కంప్యూటర్ స్క్రీన్ లు చూడటమే ప్రపంచం అయిపోయింది. పెరిగిన 'స్క్రీన్ టీమ్' మీ కంటి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. కంటి ఆరోగ్యానికి స్క్రీన్ టైమ్ తగ్గించడంతో పాటు, సమతుల్య ఆహారం, తాజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

Jyothi Gadda

|

Updated on: Nov 21, 2023 | 9:20 PM

Citrus Fruits-కంటి ఆరోగ్యానికి మంచి చేసే పండ్లలో ముందుగా సిట్రస్‌ పండ్లను గురించి తెలుసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, ద్రాక్షపండ్లు మొదలైన పుల్లని పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. ఇది వయస్సు-సంబంధిత దృష్టి లోపాలను నివారిస్తుంది. కంటిశుక్లాలకు కూడా సహాయపడుతుంది.

1 / 5
Apricots- ఆప్రికాట్లలో విటమిన్ ఎ, సి, ఇ సహా కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో బీటా కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రాత్రి దృష్టిని మెరుగుపరచడం, చీకట్లో దృశ్యాలను చూడగల కళ్ళ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటి రెటీనాను దెబ్బతీసే నీలం, అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించడంలో ఆప్రికాట్లలోని పోషకాలు సహాయపడతాయి.

2 / 5
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్‌బెర్రీస్ , బ్లాక్‌బెర్రీస్ మొదలైన బెర్రీ పండ్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గొప్ప పండ్లు. బెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు లో బీపీ, కళ్లు పొడిబారడం, దృష్టి లోపాలు, మచ్చల క్షీణతను నివారించడంలో సహాయపడతాయి.

3 / 5
Bananas -అరటిపండ్లు కూడా కంటి ఆరోగ్యానికి అతి ముఖ్యమైనవి. అరటి పండులో పొటాషియం అనే పోషకం సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తరచూ పొడి బారిన కళ్ళకు ఈ మూలకం అవసరం. మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజూవారీ ఆహారంలో అరటిపండును తప్పక తీసుకోవాలి.

4 / 5
Papaya -బొప్పాయి కూడా కంటికి మేలు చేస్తుంది. ఇందులో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్‌ వంటి కీలక పోషకాలు లభిస్తాయి.. ఇవి సహజమైన సన్‌బ్లాక్‌గా పనిచేస్తాయి. ఇది రెటీనాలోకి వచ్చే అదనపు కాంతిని గ్రహించడంలో సహాయపడుతుంది. బ్లూ లైట్ నుండి కంటిని రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.

5 / 5
Follow us