AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే హెల్తీ స్నాక్స్.. పిల్లలకూ భలే ఇష్టం..! నిమిషాల్లోనే రెడీ

సాయంత్రం వేళ కడుపులో చిన్నపాటి ఆకలి వేసినప్పుడు బయట దొరికే జంక్ ఫుడ్‌కు బదులుగా ఇంటి వద్దే రుచికరమైన చిరుతిళ్లు తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే తయారయ్యే ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్, మీ సాయంత్రం సమయాన్ని మరింత ఆనందదాయకం చేస్తాయి. ఆహ్లాదంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడే ఆ స్నాక్స్​ ఏంటో తెలుసుకుందాం..

నోరూరించే హెల్తీ స్నాక్స్.. పిల్లలకూ భలే ఇష్టం..! నిమిషాల్లోనే రెడీ
Quick And Crispy Snacks.jpg
Nikhil
|

Updated on: May 29, 2026 | 8:19 AM

Share

సాయంత్రం కాగానే ఏదో ఒకటి తినాలనిపించడం సహజం. బయట దొరికే జంక్ ఫుడ్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంటి వద్దే తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వంటగదిలో అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఇవి చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి. సమయం వృథా కాకుండా, రుచికరంగా వీటిని తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనివల్ల ఆరోగ్యం, రుచి రెండు చేకూరతాయి.

పల్లిలు, వేయించిన శనగలు, మర్మరాలు వంటివి ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచుకోవడం వల్ల వీటిని వెంటనే తయారు చేసుకోవచ్చు. వీటిని ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు. దీనివల్ల కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. సాయంత్రం ఆకలిని తీర్చుకోవడానికి వీటిని ఎంచుకోవడం ఉత్తమం.

వేరుశనగ మసాలా

వేయించిన వేరుశనగ గుళ్లను తీసుకుని, వాటిలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, నిమ్మరసం కలుపుకోవాలి. ఇది ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం చల్లుకోవచ్చు. ఇది కేవలం పది నిమిషాల్లో తయారవుతుంది.

మరమరాలతో..

మరమరాలను తీసుకుని, కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు, ఆవాలు, పల్లీలతో పోపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కారం వేసి మర్మరాలను వేయించాలి. ఇది చాలా కాలం నిల్వ ఉంటుంది. కావలసినప్పుడు ఆనియన్స్, నిమ్మరసం కలుపుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఎంతో క్రంచీగా ఉంటుంది.

Follow Us