పుచ్చకాయలో నిజంగానే ఎర్ర రంగు కలుపుతారా? FSSAI చెప్పింది ఇదే
Krishna
28 May 2026
పుచ్చకాయను నీటిలో ముంచినప్పుడు నీరు ఎర్రగా మారితే దానిలో రంగును ఇంజెక్ట్ చేశారని చాలా మంది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో జనాలు పుచ్చకాయలు తినడమే మానేసే పరిస్థితి వచ్చింది.
అపోహలు
పుచ్చకాయలకు ఎరుపు రంగును ఇవ్వడానికి వాటిలోకి ఎరుపు రంగును ఇంజెక్ట్ చేస్తారనే వాదనను FSSAI పూర్తిగా కొట్టిపారేసింది. శాస్త్రీయంగా అలా చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
అసాధ్యం
వాస్తవానికి ఒకవేళ పుచ్చకాయలోకి రంగును బలవంతంగా ఇంజెక్ట్ చేసినప్పటికీ.. ఆ రంగు పుచ్చకాయ లోపల పూర్తిగా వ్యాపించదు. రంగు అంతా ఒకే చోట ముద్దగా ఆగిపోయి.. ఇంజెక్షన్ చేసిన చోట మాత్రమే కలర్ మారుతుంది.
ఒకే చోట రంగు
వేసవిలో ఎక్కువగా లభించే కాయలలో ఒక్కోదానికి రంగును ఇంజెక్ట్ చేయడం అనేది వ్యాపారులకు ఆచరణాత్మకంగా సాధ్యం కాదు. ఎందుకంటే దీనివల్ల ఖర్చులు గణనీయంగా పెరగడమే కాకుండా విపరీతమైన శ్రమ కూడా అవసరమవుతుంది.
భారీ ఖర్చు
పుచ్చకాయలోకి సిరంజి ద్వారా రంగును ఎక్కించడానికి ప్రయత్నిస్తే.. ఆ రంధ్రం గుండా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా పుచ్చకాయలోకి సులభంగా ప్రవేశిస్తుంది. దీనివల్ల పుచ్చకాయ మార్కెట్లోకి వచ్చే లోపే కుళ్లిపోతుంది.
త్వరగా కుళ్లిపోతుంది
ఎలాంటి భయాలు లేకుండా పుచ్చకాయను వేసవి డైట్‌లో సురక్షితంగా చేర్చుకోవచ్చు. అమెరికా వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం.. పుచ్చకాయలో సుమారు 91 శాతం కేవలం నీరే ఉంటుంది. ఇది ఎండదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
పోషకాల నిధి
పుచ్చకాయ కేవలం నీటి శాతం మాత్రమే కాదు.. ఇందులో శరీరానికి అత్యంత అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఫ్లోరైడ్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
శరీరానికి మేలు
వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి తట్టుకోవడానికి ఇందులో విటమిన్ సి, ఫోలేట్ వంటి శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడతాయి.