AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pink Salt vs White Salt: పింక్ సాల్ట్ లేదా వైట్ సాల్ట్.. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

Pink Salt vs White Salt: రెండింటికీ వాటి ప్రయోజనాలు, అప్రయోజనాలు ఉన్నాయి. మీరు అయోడిన్ కోరుకుంటే సాధారణ ఉప్పు సరైనది. మీరు సహజ ఖనిజాలు, వేరే రుచిని కోరుకుంటే మీరు పింక్‌ సాల్ట్‌ను తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి.. ఏదైనా..

Pink Salt vs White Salt: పింక్ సాల్ట్ లేదా వైట్ సాల్ట్.. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
Subhash Goud
|

Updated on: Jul 30, 2025 | 1:59 PM

Share

Pink Salt vs White Salt: ఉప్పు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. కూరగాయలు వండడానికి అయినా, సలాడ్‌లో చేర్చుకోవడానికి అయినా లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ రుచిని పెంచడానికి అయినా ఉప్పును ప్రతిదానిలో ఉపయోగిస్తారు. కానీ అదనపు ఉప్పు అంటే అదనపు సోడియం ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ట్ మంచిదా? తెలుసుకుందాం.

పింక్ సాల్ట్ అంటే ఏమిటి?

పింక్ సాల్ట్‌ను హిమాలయన్ సాల్ట్ అని కూడా అంటారు. ఈ ఉప్పును హిమాలయాలకు సమీపంలోని గనుల నుండి తీస్తారు. దాని గులాబీ రంగుకు కారణం దానిలో ఉండే ఐరన్ ఆక్సైడ్ వంటి ఖనిజాలు. పోషకాహార నిపుణురాలు హరిప్రియ ఎన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉప్పు ఎక్కువగా ప్రాసెస్ చేయరు. అందుకే ఇది మరింత సహజమైనదిగా పరిగణిస్తారు.

సాధారణ ఉప్పు అంటే ఏమిటి?

సాధారణ ఉప్పు లేదా టేబుల్ సాల్ట్ సాధారణంగా ఉపయోగించే ఉప్పు. దీనిని ప్రాసెసింగ్ ద్వారా తయారు చేస్తారు. దీనిలో చాలా ఖనిజాలు తొలగిస్తారు. దీనికి యాంటీ-కేకింగ్ ఏజెంట్లు కూడా జోడిస్తారు. CDC ప్రకారం, ఒక టీస్పూన్ సాధారణ ఉప్పులో దాదాపు 2400 mg సోడియం ఉంటుంది. అయితే US FDA రోజుకు 2300 mg కంటే తక్కువ సోడియం తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

పింక్‌ సాల్ట్‌ -సాధారణ ఉప్పు మధ్య తేడా ఏంటి?

  • రెండూ ప్రధానంగా సోడియం క్లోరైడ్‌తో కూడి ఉంటాయి. పింక్‌ సాల్ట్‌లో 84-98 శాతం, సాధారణ ఉప్పులో 97-99 శాతం ఉంటాయి.
  • రెండింటినీ ఆహార రుచిని పెంచడానికి, ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
  • రెండింటినీ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

తేడా ఏమిటి?

  • మూలం: సముద్రపు నీరు లేదా ల్యాండ్ మైన్‌లను ప్రాసెస్ చేయడం ద్వారా సాధారణ ఉప్పును తయారు చేస్తారు. అయితే పింక్‌ సాల్ట్‌ను హిమాలయాలకు సమీపంలోని ఉప్పు గనుల నుండి తయారు చేస్తారు.
  • ప్రాసెసింగ్: సాధారణ ఉప్పు మరింత శుద్ధి చేస్తారు. దానికి అయోడిన్ జోడిస్తారు. పింక్ సాల్ట్ సహజమైనది. అలాగే శుద్ధి చేయరు.
  • ఖనిజాలు: పింక్ సాల్ట్‌లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి 84 కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి (ఫుడ్స్ జర్నల్ ప్రకారం సమాచారం).
  • రంగు, ఆకృతి: సాధారణ ఉప్పు తెల్లగా, సన్నగా ఉంటుంది. అయితే గులాబీ ఉప్పు పింక్‌ కలర్‌లో ఉంటుంది. మరి సన్నగా కాకుండా కొంత దొడ్డుగా ఉంటుంది.
  • రుచి: సాధారణ ఉప్పు ఎక్కువ ఉప్పగా ఉంటుంది. అదే పింక్‌ సాల్ట్‌లో ఉప్పు తేలికపాటి , ఖనిజ రుచిని కలిగి ఉంటుంది.
  • ఆరోగ్య ప్రయోజనాలు: క్రమం తప్పకుండా ఉప్పు తీసుకోవడం వల్ల అయోడిన్ లోపాన్ని నివారించవచ్చు. పింక్ సాల్ట్ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Maruti Suzuki: ఈ కారు రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది!

ఇందులో ఏ ఉప్పు తీసుకోవాలి?

రెండింటికీ వాటి ప్రయోజనాలు, అప్రయోజనాలు ఉన్నాయి. మీరు అయోడిన్ కోరుకుంటే సాధారణ ఉప్పు సరైనది. మీరు సహజ ఖనిజాలు, వేరే రుచిని కోరుకుంటే మీరు పింక్‌ సాల్ట్‌ను తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి.. ఏదైనా ఉప్పును అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

ఇది కూడా చదవండి: Gold Price: మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే రేట్లు తారుమారు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

ఇది కూడా చదవండి: Viral Video: హేయ్.. నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క.. వీడియో వైరల్‌

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి