Viral Video: హేయ్.. నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క.. వీడియో వైరల్
Viral Video: రోడ్డుపై పడుకున్న కుక్కపై పులి పొదల నుంచి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే అలర్ట్ అయిన కుక్క.. అరుపులతో ఎదురు దాడికి దిగింది. కుక్క బెదిరింపులకు పులి వెళ్లిపోయింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ సోషల్..

సాధారణంగా ఏదైనా వైరల్ అయ్యిందంటే అది సోషల్ మీడియానే అని చెప్పాలి. ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాములు, సింహాలు, పులులు, ఇతర జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నిగా ఉంటే మరి కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటాయి. ఇక ఎక్కడై పులి కనిపించిందంటే చాలు ఎవరైనా సరే గజగజ వణికిపోవాలసిందే. పులి చూస్తేనే గుండె ఆగినంత పని అవుతుంది. ఎంతటి బలమైన జంతువులను సైతం ఓడించే సత్తా పులికి ఉంటుంది. అలాంటి ఓ కుక్క ఏకంగా పులినే ఎదురించింది. కుక్క అరుపులకు పులి చేసేదేమి లేక సైలెంట్‌గా వెళ్లిపోయింది.
రోడ్డుపై పడుకున్న కుక్కపై పులి పొదల నుంచి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే అలర్ట్ అయిన కుక్క.. అరుపులతో ఎదురు దాడికి దిగింది. కుక్క బెదిరింపులకు పులి వెళ్లిపోయింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్క అరుపులతో చిరుతపులి తోకముడిచి వెళ్లిపోయింది. ధైర్యం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చుని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: AIIMS: మద్యం తాగితే 7 ప్రమాదకర క్యాన్సర్లు.. ఎయిమ్స్ అధ్యయనంతో షాకింగ్ నిజాలు
ఇది కూడా చదవండి: Honda Shine 100 DX: హీరో స్ప్లెండర్, HF డీలక్స్ ప్రోను తలదన్నే మరో చౌకైన బైక్..




