AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMS: మద్యం తాగితే 7 ప్రమాదకర క్యాన్సర్లు.. ఎయిమ్స్‌ అధ్యయనంతో షాకింగ్‌ నిజాలు

AIIMS: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS) నిర్వహించిన అధ్యయనంలో ఏడు రకాల క్యాన్సర్‌లకు మద్యం సేవించడం ప్రధాన కారణమని వెల్లడైంది. దీనిపై క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ అభిషేక్ శంకర్ మాట్లాడుతూ.. మద్యం సీసాలపై రాసిన హెచ్చరికలను..

AIIMS: మద్యం తాగితే 7 ప్రమాదకర క్యాన్సర్లు.. ఎయిమ్స్‌ అధ్యయనంతో షాకింగ్‌ నిజాలు
Subhash Goud
|

Updated on: Jul 28, 2025 | 1:53 PM

Share

మద్యం తాగడం ఎంజాయ్‌ అనిపించవచ్చు. కానీ దాని వెనుక ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలియదు. మద్యం తాగడం అరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే మీరే షాకవుతారు. AIIMS వైద్యుల అధ్యయనం ఒక షాకింగ్ నిజం బయటపడింది. మద్యం సేవించడం వల్ల మీ కాలేయం దెబ్బతినడమే కాకుండా, 7 రకాల ప్రాణాంతక క్యాన్సర్‌లకు కూడా కారణమవుతుంది.

ఇది కూడా చదవండి: Honda Shine 100 DX: హీరో స్ప్లెండర్, HF డీలక్స్ ప్రోను తలదన్నే మరో చౌకైన బైక్‌..

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS) నిర్వహించిన అధ్యయనంలో ఏడు రకాల క్యాన్సర్‌లకు మద్యం సేవించడం ప్రధాన కారణమని వెల్లడైంది. దీనిపై క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ అభిషేక్ శంకర్ మాట్లాడుతూ.. మద్యం సీసాలపై రాసిన హెచ్చరికలను ప్రజలు విస్మరిస్తున్నారని, దాని పరిణామాలు తీవ్రమైన వ్యాధుల రూపంలో అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: School Holidays: భారీ వర్షాలు.. విద్యార్థులకు సెలవులు ప్రకటించిన అధికారులు!

నిజానికి నేటి సమాజంలో మద్యం సేవించడం ఒక సాధారణ అలవాటుగా మారుతోంది. కొన్నిసార్లు పార్టీలో, కొన్నిసార్లు ఒత్తిడి పేరుతో, కొన్నిసార్లు స్నేహితులతో సరదాగా గడిపే పేరుతో, మద్యం తాగడం ఎక్కువైపోతుంటుంది. కానీ దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటున్నారు.

ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు పేదరికంలో పుట్టినా ధనవంతులవుతారట!

7 రకాల క్యాన్సర్లు ఏమిటి?

  • పెద్దప్రేగు క్యాన్సర్ (మల క్యాన్సర్)
  • కాలేయ క్యాన్సర్
  • రొమ్ము క్యాన్సర్
  • అన్నవాహిక క్యాన్సర్
  • స్వరపేటిక క్యాన్సర్
  • ఫారింక్స్ క్యాన్సర్ (గొంతు క్యాన్సర్)
  • నోటి క్యాన్సర్

ఎవరికి అది సమస్య కావచ్చు?

  • క్రమం తప్పకుండా మద్యం సేవించే వ్యక్తులు
  • మద్యపానం చేసేవారికి ప్రమాదకరం
  • మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ
  • జీవనశైలిలో వ్యాయామం, పోషకమైన ఆహారం, నిద్ర లేని వారు

నివారణే ఉత్తమ పరిష్కారం:

  • మీరు క్యాన్సర్‌ను నివారించాలనుకుంటే మద్యానికి దూరంగా ఉండటమే ఏకైక సురక్షితమైన మార్గం.
  • మద్యం మానేయడం మాత్రమే సరిపోదు. దానితో పాటు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, కాలానుగుణ ఆరోగ్య పరీక్షలు కూడా అవసరం.
  • మద్యం తాగడం అనేది కేవలం ఒక అలవాటు కాదు. శరీరాన్ని లోపలి నుండి బయటకు నెట్టే ఒక విషం. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ చేసిన ఈ అధ్యయనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇంకా ఉందని హెచ్చరిస్తోంది. ఈ రోజు మన అలవాట్లను మార్చుకోకపోతే రేపు మనం పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరిస్తోంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన సహాలు, సూచనల, అలాగే అధ్యయనాలలో వెలువడిన సమాచారం ప్రకారం అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి