- Telugu News Photo Gallery Technology photos These precautions are essential if you are using a smartwatch on your wrist
చేతికి స్మార్ట్ వాచ్ వాడుతుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
చేతికి స్మార్ట్ వాచ్ వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా, ఛార్జింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాచ్ కిందపడే ప్రమాదం ఉంది. అలాగే, వాచ్ ని మణికట్టు నుండి తీసి ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి స్మార్ట్ వాచ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? ఈరోజు మనం ఈ స్టోరీలో పూర్తి వివరంగా తెలుసుకుందాం పదండి..
Updated on: Jul 30, 2025 | 1:53 PM

ప్రస్తుతం దాదాపు అందరి చేతికి స్మార్ట్ వాచ్ కనిపిస్తుంది. ఇందులో నడిచే అడుగులను లెక్కించడంతో పాటు హార్ట్ రేట్, స్లీప్ మోనిటర్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకొని మెసేజులు చూడవచ్చు, వాట్సాప్ నోటిఫికెషన్స్ చెక్ చేయవచ్చు, కాల్స్ కూడా మాట్లావచ్చు. అయితే ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచ్ వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కొంతమందికి స్మార్ట్ వాచ్ వల్ల చర్మ సమస్యలు రావచ్చు. వాచ్ ని చాలా గట్టిగా కాకుండా, కొంచెం వదులుగా ఉండేలా కట్టుకోవడం మంచిది. కొందరు స్మార్ట్ వాచ్‌ల నుండి వచ్చే రేడియేషన్ వల్ల తలనొప్పి లేదా వికారం లాంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అలాంటి సమస్యలు ఉంటే వాచ్‌ని వాడటం తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.

స్మార్ట్ వాచ్ వాడటం వల్ల కొందరికి నిద్రలేమి సమస్యలు వస్తున్నాయని కూడా చెబుతున్నారు. కాబట్టి, నిద్రపోయే ముందు స్మార్ట్ వాచ్‌ని తీసివేయడం మంచిది. స్మార్ట్ వాచ్‌లు కొన్ని నీటి నిరోధకత కలిగి ఉన్నప్పటికీ, వాటిని ఎక్కువసేపు నీటిలో ఉంచడం మంచిది కాదు. అందుకే వీటీని నీటికి దూరంగా ఉంచండి.

వాచ్‌ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు, అది ఎక్కువ వేడెక్కుతుందో లేదో గమనించాలి. వేడెక్కుతుంటే, ఛార్జింగ్ ఆపేయడం మంచిది. స్మార్ట్ వాచ్‌లలో అనేక ఫీచర్లు ఉన్నప్పటికీ, అన్ని ఫీచర్లను ఉపయోగించకపోవచ్చు. కాబట్టి, మీకు అవసరమైన ఫీచర్లను మాత్రమే ఉపయోగించడం మంచిది.

స్మార్ట్ వాచ్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడదు. ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను ట్రాక్ చేస్తుంది. అయితే దీన్ని జాగ్రత్తగా వాడటం ముఖ్యం అంటున్నారు నిపుణులు. లేదంటే అనారోగ్య సమస్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.




