- Telugu News Photo Gallery Business photos Today Gold Price: Gold hits Rs 1 lakh per 10 grams in Hyderabad, Mumbai, Delhi, other cities
Gold Price: మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే రేట్లు తారుమారు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?
Today Gold Price: రానున్న రోజుల్లో పండలల సీజన్ మొదలవుతుంది. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ప్రియులు కొనుగోళ్ల విషయంలో ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుతం మాత్రం తులం బంగారంపై భారీగా పెరిగింది...
Updated on: Jul 30, 2025 | 12:27 PM

Gold Price: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఒక స్వల్పంగా పెరిగితో మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. జూలై 29న ఉదయం 6 గంటల సమయానికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంటే తులం బంగారం ధర 99 వేల్లోనే ట్రేడయ్యింది. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయానికి పరిశీలిస్తే భారీగా ఎగబాకింది. బంగారం కొనుగోలు చేసే మహిళలకు గట్టి షాకిచ్చింది. ఇప్పుడు 24 క్యారెట్ల పది గ్రాముల ధరపై ఏకంగా 660 రూపాయలు పెరిగి 1 లక్షా 480 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 600 రూపాయల మేరకు పెరిగి తులం ధర 92,210 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే నేనుందుకు తగ్గాలే అన్నట్లుగా కిలో వెండిపై వెయ్యి రూపాయల వరకు పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర 1 లక్షా17 వేల రూపాయల వద్ద నమోదైంది. ఇక చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో అయితే 1 లక్షా 27 వేల వరకు ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గిన ఈ పసిడి ధరలు తాజాగా ఊహించని రీతిలో మళ్లీ ఎగబాకాయి. మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. సామాన్యులకు సైతం అందని ద్రాక్షలా మారిపోయింది. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు లక్ష రూపాయలు దాటేశాయి.

పండుగ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు మరింత భగ్గుమనేలా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే బంగారం కొనాలంటేనే భారంగా మారిన మహిళలకు.. మున్ముందు గ్రాము కొనాలన్న కూడా కొనలేని పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే తగ్గినప్పుడు, బంగారం దిగుమతి ఖరీదైనదిగా మారుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో విధించిన టారిఫ్ సుంకాలు ఆగస్టు 1 నుంచి మళ్లీ అమల్లోకి రానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణిస్తున్నారు.




