AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షంలో వేడి వేడిగా ఎంజాయ్ చేయండి.. స్పెషల్ మక్కజొన్న రెసిపీలు మీకోసం..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వేడి వేడి టిఫిన్లు, స్నాక్స్ తినాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంటుంది. ముఖ్యంగా మక్కజొన్నతో తయారయ్యే వంటకాలు ఈ సీజన్‌ లో చాలా స్పెషల్‌ గా ఉంటాయి. హెల్త్, టేస్ట్ రెండూ కలిపి ఇచ్చే ఈ మక్కజొన్న రెసిపీలు మీకు నచ్చే తీరుతాయి. ఇప్పుడు మక్కజొన్నతో తయారు చేయగల ఐదు రుచికరమైన వంటల గురించి తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Jul 30, 2025 | 2:00 PM

Share
మసాలా కార్న్ (Masala Corn).. కొద్ది సేపటిలో సులభంగా తయారయ్యే ఒక హాట్ అండ్ స్పైసీ స్నాక్ ఇది. ఉడికించిన మక్కజొన్న గింజల్లో బటర్ వేసి కొద్దిగా నిమ్మరసం పిండి చాట్ మసాలా, కారం జతచేస్తే చాలు.. టేస్టీగా, వేడిగా సిద్ధం అవుతుంది. వర్షం పడుతుండగా ఓ కప్పు టీతో కలిసి తినడానికి చాలా బాగుంటుంది.

1 / 5
మక్కజొన్న పకోడీ (Corn Pakoras).. వర్షంలో వేడి వేడి పకోడీలే అదిరిపోయే కాంబినేషన్. మక్కజొన్న ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, మిర్చి, ఉప్పు వంటి మసాలాలతో కలిపి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. గోధుమ రంగులో క్రిస్పీగా వస్తే ప్లేట్‌ లో వేసుకుని టీతో కలిసి తింటే చిరుతిండికి పర్ఫెక్ట్ చాయిస్ ఇది.

2 / 5
స్వీట్ కార్న్ సూప్ (Sweet Corn Soup).. ఇదొక ఇండియన్ టచ్ ఉన్న చైనీస్ సూప్. మక్కజొన్నతో పాటు క్యారెట్, బీన్స్, మిరియాల పొడి వంటివి వేసి మరిగించి వేడి వేడి సూప్ తయారు చేస్తారు. చల్లదనాన్ని పోగొట్టే ఈ సూప్ వర్షాకాలంలో శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. హెల్దీగా, లైట్‌గా ఏదైనా తాగాలనిపిస్తే ఇదే బెస్ట్.

3 / 5
కార్న్ భేల్ (Corn Bhel).. ఇది వీధిలో దొరికే భేల్‌కు ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం. ఉడికించిన మక్కజొన్నలో ఉల్లిపాయలు, టమాటాలు, కొంత నిమ్మరసం, తక్కువ మిరియాల పొడి, కొంచెం చట్నీలు కలిపితే హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెడీ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆప్షన్.

4 / 5
కార్న్ చీజ్ టోస్ట్ (Corn and Cheese Toast).. ఈ టోస్ట్ పిల్లలకే కాదు.. పెద్దవాళ్లకూ నచ్చే టైప్. ఉడికించిన మక్కజొన్నను చీజ్‌తో కలిపి కొంచెం మిరియాల పొడి, ఉప్పు, హర్బ్స్ వేసి బ్రెడ్ పై వేసి గ్రిల్ చేస్తే.. గోల్డెన్ టోస్ట్ తయారవుతుంది. ఇది ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్‌ పరంగా పుష్కలంగా పోషకాలు అందించేది కూడా. బ్రేక్‌ ఫాస్ట్‌ కు లేదా సాయంత్రం స్నాక్‌ కు పర్ఫెక్ట్ రెసిపీ ఇది.

5 / 5