సరికొత్త జీవకారుణ్యం.. పెట్ కల్చర్‌లో క్యాట్‌ కల్చర్.. పిల్లున్ని ఇష్టపడితేనే పెళ్లికొడుకులకు గ్రీన్‌ సిగ్నల్

పెట్ వరల్డ్ లో అతిపెద్ద సేలర్ గా పిల్లులు రికార్డులు సృష్టిస్తోంది. అది ఎంత అంటే.. పిల్లలు కోసం అదనంగా అపార్టుమెంట్‌ కొంటున్నారు. పిల్లుల్ని ఇష్టపడకపోతే... పెళ్లికొడుకులకు నో చెబుతున్నారు.

సరికొత్త జీవకారుణ్యం.. పెట్ కల్చర్‌లో క్యాట్‌ కల్చర్.. పిల్లున్ని ఇష్టపడితేనే పెళ్లికొడుకులకు గ్రీన్‌ సిగ్నల్
Cat Lovers
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 25, 2022 | 3:01 PM

పిల్లి ఎదురొస్తే అపశకునం.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పిల్లుల పెంపకం కాస్మోపాలిటన్ సిటీస్ లో అతిపెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. పిల్లి అపశకునమని ఎవరైనా అంటే..క్యాట్ లవర్స్ అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే అవి వారిజీవితంలో ఒక భాగం. అవును అపశకునానికి మారుపేరుగా భావించే పిల్లి ఇప్పుడు విశ్వాసంలో కుక్క స్థానాన్ని బీట్ చేస్తోంది. పెట్ వరల్డ్ లో అతిపెద్ద సేలర్ గా పిల్లులు రికార్డులు సృష్టిస్తోంది. అది ఎంత అంటే.. పిల్లలు కోసం అదనంగా అపార్టుమెంట్‌ కొంటున్నారు. పిల్లుల్ని ఇష్టపడకపోతే… పెళ్లికొడుకులకు నో చెబుతున్నారు. మరోవైపు పర్షియన్ క్యాట్స్ లాంటి పెట్స్ వ్యాపారం కోట్ల రూపాయల బిజినెస్ కు కెరాఫ్‌ అడ్రస్ గా మారిపోయింది. ఇలా హైదరాబాద్ లో క్యాట్ కల్చర్ కొత్త ప్రపంచాన్ని చూపిస్తోంది.

ఇళ్లలో పెంచుకునే జంతువుల్లో డాగ్ ముందువరుసలో ఉంటుంది. ఎందుకంటే.. కుక్కలకు,మనుషులకు మధ్య అంత అండర్ స్టాండ్ ఏర్పడింది. అందులోనూ డాగ్స్.. విశ్వాసానికి కేరాఫ్‌ అడ్రస్. అయితే.. ఇప్పుడు పరిస్థితులు తారుమారువుతున్నాయి. ఎక్కడో ఫారిన్ కల్చర్ లో చూసే… పిల్లల పెంపకం.. ఇప్పుడు హైదరాబాద్ విస్తరిస్తోంది. పెట్ యానిమల్ గా క్యాట్ దూసుకుపోతోంది. దానితో పాటే.. పిల్లల వ్యాపారం. అందులో పర్షియన్ క్యాట్ పై మోజు… వ్యాపారం అతిపెద్ద స్థాయిలో సాగుతున్నాయి.

పెంపుడు పిల్లుల్లో కొన్ని బ్రీడ్స్ చూడగానే ముద్దాడాలనిపిస్తుంది. ఎందుకంటే అంత క్యూట్ గా ఉంటాయవి. ఉదాహరణకు పర్షియన్ బ్రీడ్ క్యాట్స్. మామూటు క్యాట్ కు పర్షియన్ క్యాట్స్ కు మద్య చాలా వ్యత్యాసం కన్సిస్తోంది. వీటికి జూల్ ఎక్కువ.. అందులోనూ చాలా క్యూట్ ఫేసెస్ తో ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ పర్షియన్ క్యాట్స్ లో చాలా రకాలే ఉన్నాయి. పంచ్ ఫేస్ పర్షియన్, హియాలయన్ పర్షియన్ ఇలాచాలా రకాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
Cat

Cat

పర్షియన్ తో ఇండియన్ వెరైటీలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మార్కెట్ల్ లో క్యాట్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. ఇందులో బెంగాల్ క్యాట్ ఒకటి. దీన్ని చూస్తే చిన్న సైజ్ చిరుత పులిలా ఉంటుంది. అచ్చు చీతాలా అడుగులు వేస్తుంది. ఒక్క గాంఢ్రిపు తప్ప అంతా సేమ్ టు సేమ్. అందుకే ఈ మధ్యకాలంలో ఈ వెరైటీ పిల్లల అమ్మకాలు చాలా జోరందుకున్నాయంటున్నారు క్యాట్ బ్రీడ్ డెవలపర్ అండ్ సేలర్ మొయినుద్దీన్. పిల్లులే కదా అని తేలికగా చూస్తే తప్పులో కాలేసినట్లే. పదో పరకకో దొరుకుతాయనుకోవడం కంటే మించిన అమాయకత్వం మరొకటి లేదు. అన్నీ వేల రూపాయల్లోనే..  30 వేల నుంచి 80వేల వరకూ ఉన్నాయి. కొన్ని రేర్ బ్రీడ్స్ అయితే… లక్షలు దాటి ఉంటున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఈ క్యాట్స్ వ్యాపారం లక్షలు దాటి కోట్లకు చేరింది. ఎందుకంటే.. ఈ క్యాట్స్ వెరైటీయే కాదు… చాలా కాస్ట్ గురూ అంటున్నారు వ్యాపారులు.

పిల్లులతో సావాసం కాదు… వాటితో సహజీవనం. అవును.. ఇప్పుడు క్యాట్ కు క్యాట్ లవర్స్ ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. క్యాట్స్ పెరిగాయని… ఒకరు అదనంగా ఒక ఇంటినే కొంటే… మరికొందరు చనిపోయిన తమ పిల్లుల జ్ఞాపకాలు చెరిగిపోకుండా వంటిపై ట్యాటూలు వేయించుకుంటున్నారు. ఇంకొందరు మరింత ముందుకెళ్లి… పిల్లులను ప్రేమించేవారినే పెళ్లిచేసుకుంటామని కండీషన్లు పెడుతున్నారు. ఆశ్యర్యంగా ఉందా..అయితే.. ఈ కేస్ స్టడీస్ చూడాల్సిందే. హైదరాబాద్ నిజామ్ పేట్ లో నివాసం ఉండే చిత్ర. చాలా ఏళ్లుగా పిల్లలను పెంచుతున్నారు. బయట గాయపడిన.. ఆనాథగా ఉండే పిల్లలను రెస్క్యూ చేసి తీసుకువచ్చి వాటిని సాకుతున్నారు. వీటిని క్యాట్ లవర్స్ దొరికితే వారికి దత్తత ఇస్తుంటారు. అందుకే ఈమె ఇల్లంతా పిల్లులే కనిపిస్తాయి. అందుకే ఇక్కడ రెస్క్యూ చేసిన పిల్లుల్లో కొన్ని ఫిజికల్లీ ఛాలెంజెడ్ క్యాట్స్ కనిపిస్తాయి. వీటికి ఆహారం.. ఆటలు ఆడించడం ఈ ఇంట్లో దినచర్య. పిల్లల్ని ప్రేమించినట్లే వీటినీ ప్రేమిస్తారు.

చిత్ర కుటుంబంలో నాలుగురే. భర్త, ఇద్దరు పిల్లలు.. అమ్మాయి అబ్బాయి చదువుల నిమిత్తం బయటే ఉంటారు. కానీ ఇంట్లో పిల్లుల సంఖ్య క్రమంగా పెరిగింది. వాటికి కూడా సరైన సౌకర్యం ఉండాలి కదా… అందుకే చిత్ర కుటుంబం పిల్లుల కోసం తాము ఉంటున్న అపార్టుమెంట్ పై భాగాన్ని లక్షలు వెచ్చించి కొన్నారు. దాన్ని డూప్లెక్స్ హైస్ గా మార్చి పిల్లులకు ఇచ్చేశారు. ఆశ్యర్యంగా ఉన్నా పిల్లును వారు ఎంతగా ప్రేమిస్తున్నారో ఇది చెప్పకనే చెబుతోంది. పిల్లులంటే..అవి పెట్ యానిమల్స్ కాదు.. తమ కుటంబ సభ్యుల్లో ఒకరిగా ట్రీట్ చేస్తారు వారు. అందుకే అవి అనుకోకుండా మరణిస్తే ఆ చేదుజ్ఞాపకాలు మర్చిపోలేరు. ఆ జ్ఞాపకాలు చెరిగిపోకుండా… శరీరంపై ట్యాటూలు వేయించుకుంటున్నారు. తమ గుండెల్లో వాటి స్మృతులు ఎప్పటికీ సజీవమని చాటుకుంటారు. తప్పిపోయిన తన పిల్లి జాడ చెబితే రూ.20వేల నగదు బహుమతి ఇస్తానంటూ కొన్ని నెలల క్రితం జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ క్యాట్ లవర్ ప్రకటనలు ఇచ్చాడంటే వ్యవహారం ఎంత వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఓ మైసూరుకు చెందిన మెడిసిన్ విద్యార్థిని.. తన పెట్ క్యాట్‌ను అక్కడ విడిచి భారత్‌కు విమానం ఎక్కనంటే తెగేసి చెప్పింది. యుద్ధంలో చావు తథ్యమంటే పెట్ క్యాట్‌తో కలిసే అదే మార్గాన్ని ఎంచుకుంటానంటూ తన పెట్ క్యాట్‌పై హద్దుల్లేని ప్రేమను చాటుకుంది.

Cat2

Cat Lover

నెమ్మదిగా ప్రారంభమైన పెట్ క్యాట్ కల్చర్ చివరికి వాటి ప్రేమతోనే తమ జీవితం ఉందన్న స్థాయికి చేరారు రమ్య. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం. అవుటర్ రింగ్ రోడ్డ్ ప్రాంతంలోని అవతార్ అపార్టుమెంట్స్ లో నివాసం. పిల్లులను పెంచుకోవడం ద్వారా తనకు ఒంటరినీ అనే లోటు లేకుండా పోయిందంటున్నారు రమ్మ. చివరికి అవిలేకపోతే..తాను లేననే ఫీలింగ్. అందుకే అనేక పెళ్లి సంబంధాలు వచ్చినా..వారికి క్యాట్స్ అంటే ఇష్టమేనా.. తనలాగానే వాటిని ప్రేమించగలరా… ఆదరించగలరా? అనే విషయాలు తెలుసుకుంటారు.. వారికి ఇష్టంలేదంటే… ఆ సంబంధమే వద్దనుకుంటున్నారు. క్యాట్ లవర్స్ గా ఉన్న వారిని మాత్రమే తాను జీవిత భాగస్వామిగా అంగీకరిస్తానని తేల్చేస్తున్నారు రమ్య.

కుక్కలు విశ్వాసం చూపిస్తాయి. కానీ ఆ స్థాయిలో పిల్లులు కనిపించవు.మరో వైపు అనేక సెంటిమెంట్స్ ముడిపడి ఉన్నాయి. ఇంతకీ…క్యాట్ కల్చర్ ఎందుకు పెరుగుతోంది. ఇంతకీ మనల్ని కట్టిపడేసే కల్చర్, కంఫర్ట్ పిల్లుల్లో ఎలా ఉంది. కుక్కలకు …తమకు ఇంత ముద్దపెట్టే వారే దేవుళ్లు. కానీ పిల్లులకు మాత్రం ఇదిపూర్తి రివర్స్. తమని ఆహారం పెట్టి పెంచుకుంటున్నారు కాబ్టటి వారికి మేమే దేవుళ్లం అనుకుంటాయి. అవును ఇదే బిహేవియర్ తో క్యాట్స్ ఉంటాయి. కుక్కలు… తమను పెంచుకుంటున్న వారి చుట్టూ తిరుగుతాయి. వాళ్లు మిస్ అయితే.. అల్లల్లాడిపోతాయి. యజమానిపై బెండపెడతాయి. కానీ పిల్లులు దీనికి పూర్తి భిన్నం. ఆహారం పెట్టిన వెంటనే తినవు. వాటికి కావల్సిప్పుడు మాత్రమే తింటాయి. యజమాని వచ్చిన వెంటనే అవి హత్తుకోవాలనుకోవు. పూర్తిగా ఇండివిడ్యుయల్ గా ఉండే యానిమల్ అంటున్నారు క్యాట్ సైకాలజీ స్టడీ చేసిన క్యాట్ లవర్ శారద. పిల్లులను పెంచుకునే కల్చర్ ఇంత వేగంగా పెరగటానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. డాగ్స్ తో పోల్చుకుంటే… వాటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తక్కువ. అపార్టుమెంట్లు, ఇతర జనావాస కమ్యూనిటీల్లో వాటిని పెంచడం ఈజీ. ఇల్లు కదలి బయటకు వెళ్లాలని అనుకోవు. వాటి అరుపులు ద్వారా చేష్టలు ద్వారా పొరుగువారికి ఇబ్బంది ఉండదు. పగటి పూట నిద్ర..రాత్రిపూట ఎక్కువ మేల్కొనే లక్షణం. వాటి దైనందిక కార్యక్రమాలు కూడా పెంచుకునే వారిని ఇబ్బంది పెట్టవు. మరోవైపు పిల్లంటే చాలా శుభ్రంగా ఉండే యానిమల్ అంటున్నారు. అందుకే వాటిని పెంచడం కోసం ఎంత ఖర్చయినా భరిస్తున్నారంటున్నారు.

అందుకే.. క్యాట్ అడాప్షన్ కల్చర్ పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో మరింత పెరిగింది. వేల మంది క్యాట్ లవర్స్ . వాట్స్ ప్ లేదా సోషల్ మీడియాల్లో ఒక కారిడార్ గా కొనసాగుతున్నారు. దీనితో పాటే వ్యాపరం కూడా పెరుగుతోంది. ఇలా కోట్లకు చేరుతున్న వ్యాపారాన్ని తప్పుపడుతున్న క్యాట్ లవర్స్ ఉన్నారు. ఇతర దేశాల నుంచి తీసుకువచ్చే క్యాట్ లు చూడటానికి మంచి లుక్ తో ఉంటాయి కనుక వాటిని పెట్స్ గా చేసుకునే వారు పెరుగుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయంగా^ఉండే పిల్లులను ఆదరించాలనే డిమాండ్ ను కొందరు ముందుకు తీసుకువస్తున్నారు. ఏదైనా హైదరాద్ లో క్యాట్ కల్చర్ ఊహకు అందని స్థాయిలో పెరుగుతోంది.దానితో పాటే వ్యాపారం కూడా పెరిగింది.ఈ కొత్త క్యాట్ కల్చర్ ఎలాంటి మలుపుతు తిరగుతుందో చూడాలి.

(గణేష్‌.వై, టివి9 తెలుగు, హైదరాబాద్‌)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలు చదవండి..

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?