Health Tips: రాత్రి భోజనంలో వీటిని అస్సలు తినకూడదు.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి..!

Health Tips: అల్పాహారం రాజులా, మధ్యాహ్న భోజనం యువరాజులా, రాత్రి భోజనం బిచ్చగాడిలా తినాలని అంటుంటారు. ఎందుకంటే..

Health Tips: రాత్రి భోజనంలో వీటిని అస్సలు తినకూడదు.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి..!
Food
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 24, 2022 | 9:46 AM

Health Tips: అల్పాహారం రాజులా, మధ్యాహ్న భోజనం యువరాజులా, రాత్రి భోజనం బిచ్చగాడిలా తినాలని అంటుంటారు. ఎందుకంటే.. ఉదయం తినే ఆహారం శరీరానికి రోజంతా కావాల్సిన మానసిక, శారీరక శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా పగటిపూట ఏ ఆహారం తిన్నా జీర్ణం చేసుకోవడం సులభం అవుతుంది. ఎందుకంటే.. అంతో ఇంతో శారీరక శ్రమ ఉంటుంది కాబట్టి.. తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. కానీ, రాత్రి పడుకునే ముందు తినే ఆహారం.. జీర్ణించుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే రాత్రి భోజనం చేసిన తరువాత సహజంగా నిద్రపోతాం. అందుకని, రాత్రి తినే భోజనం తేలికగా ఉండాలి. అది సులభంగా జీర్ణమవుతుంది. లేదంటే.. ఇది మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ మనం రాత్రి పూట సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడు? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనేది తెలుసుకుందాం..

పెరుగు.. పెరుగు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే ఇది పగటిపూట మాత్రమే తినాలి. రాత్రిపూట పెరుగు తినకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పెరుగు చల్లని స్వభావం కలిగి ఉంటుంది. రాత్రిపూట పెరుగు తినడం వల్ల శరీరంలో ఎక్కువ కఫం ఏర్పడుతుంది. దాంతో దగ్గు, జలుబు మొదలైన సమస్యలు ఏర్పడుతాయి. ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యలు ఉంటే అది మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది.

శుద్ధి చేసిన పిండి/ప్యాకింగ్ పిండి.. ప్రస్తుత రోజుల్లో అందరూ ప్యాకింగ్ పిండినే ఎక్కువగా ఆహారంలో తీసుకుంటున్నారు. తెల్లగా కనిపించే ఈ పిండిని శుద్ధి చేస్తారు. ఈ పండి త్వరగా జీర్ణం కాదు. ఇది మీ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనితో చేసే వంటకాలను రాత్రి సమయంలో అస్సలు తినకూడదు. ఉదర సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఫ్యాట్ రిచ్ ఫుడ్స్.. పన్నీర్, ఫ్రైడ్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, చీజ్ ప్రొడక్ట్స్ వంటి ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ రాత్రిపూట తినకూడదు. వీటిని తిన్న తర్వాత జీర్ణం కావడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అవి సరిగ్గా జీర్ణం కావు. దాని కారణంగా అనేక సమస్యలు వస్తాయి.

నీటి శాతం అధికంగా ఉన్న పదార్థాలు.. పుచ్చకాయ, దోసకాయ మొదలైన నీటి శాతం అధికంగా కలిగిన ఆహార పదార్థాలను రాత్రిపూట తినకూడదు. వాస్తవానికి ఇవి శరీరానికి ప్రయోజనకరమైనప్పటికీ.. రాత్రిపూట తీసుకుంటే మాత్రం శరీరానికి హానికరంగా పరిగణించబడతాయి. దీని కారణంగా కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!