AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ మహిళల్లో వేగంగా పెరుగుతోన్న ఈ వ్యాధి.. ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమా..

ప్రపంచంలోని 10% మంది మహిళలు PCODతో బాధపడుతున్నారు. PCODతో పోలిస్తే, PCOS తో బాధపడుతున్న మహిళల్లో సాధారణం కంటే ఎక్కువ పురుష హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల వారికి పీరియడ్స్ రావు.. దీంతో భవిష్యత్తులో గర్భం దాల్చడం కష్టమవుతుంది. PCOS అనేది ప్రజారోగ్య సమస్య. ఇది పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ హార్మోన్ల రుగ్మతల్లో ఒకటి. ఈ వ్యాధి పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలలో 8-13% మందిని ప్రభావితం చేస్తుంది. అయితే 70% కేసుల్లో చికిత్స తీసుకోవడం లేదు. ఈ వ్యాధి బారిన పడితే గర్భవతి అవ్వడం కష్టంగా మారుతుంది. వంధ్యత్వానికి ప్రధాన కారణం.

భారతీయ మహిళల్లో వేగంగా పెరుగుతోన్న ఈ వ్యాధి.. ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమా..
Pcod Vs Pcos
Surya Kala
|

Updated on: May 04, 2024 | 1:05 PM

Share

భారతదేశం స్త్రీల ఆలోచనల్లో మార్పు మొదలైంది. మహిళల వ్యాధుల గురించి మాట్లాడటం నుంచి ఈ రోజు అందరి ముందు వాటి గురించి చర్చించే వరకు ప్రయాణించింది. ప్రస్తుతం మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఒక వ్యాధి.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) లేదా పాలీ సిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ (PCOD). ఇది ప్రతి ఇద్దరి మహిళల్లో ఒకరికి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  30-32 ఏళ్ల మహిళలే కాదు యువతులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

ఈ వ్యాధి మహిళలకు సమస్యగా మారుతోంది. మహిళలు ఈ వ్యాధితో పోరాడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయినప్పటికీ ఈ వ్యాధి ఏమిటో, దాని కారణాలు, లక్షణాల గురించి చాలా మంది స్త్రీలకు తెలియదు. దీంతో మహిళల్లో ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా మహిళల ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతాయి. రుతుక్రమం  క్రమరహితంగా ఉంటుంది. కొన్నిసార్లు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి..  కొన్నిసార్లు వెంట వెంటనే వస్తాయి.

PCOD- PCOS అంటే ఏమిటి?

PCOD లేదా PCOS అనేది స్త్రీల అండాశయాలను ప్రభావితం చేసే పరిస్థితి. PCOD ఎక్కువగా హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. పిరియడ్ సైకిల్‌లో ప్రతి నెలా, రెండు అండాశయాలు ఫలదీకరణం చెందిన గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. అయినప్పటికీ PCOD ఉన్నవారికి అండాశయాలు తరచుగా అపరిపక్వమైన లేదా పాక్షికంగా పరిపక్వమైన గుడ్లను విడుదల చేస్తాయి. ఇవి తిత్తులుగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలో పెరుగుతోన్న పీసీఓడీ బాధితుల సంఖ్య

ప్రపంచంలోని 10% మంది మహిళలు PCODతో బాధపడుతున్నారు. PCODతో పోలిస్తే, PCOS తో బాధపడుతున్న మహిళల్లో సాధారణం కంటే ఎక్కువ పురుష హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల వారికి పీరియడ్స్ రావు.. దీంతో భవిష్యత్తులో గర్భం దాల్చడం కష్టమవుతుంది. PCOS అనేది ప్రజారోగ్య సమస్య. ఇది పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ హార్మోన్ల రుగ్మతల్లో ఒకటి. ఈ వ్యాధి పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలలో 8-13% మందిని ప్రభావితం చేస్తుంది. అయితే 70% కేసుల్లో చికిత్స తీసుకోవడం లేదు. ఈ వ్యాధి బారిన పడితే గర్భవతి అవ్వడం కష్టంగా మారుతుంది. వంధ్యత్వానికి ప్రధాన కారణం.

భారతదేశంలో పెరుగుతోంది PCOD  కేసులు

మే 2022లో భారతదేశంలోని మహిళల్లో పెరుగుతున్న PCOD సంఖ్యపై UNICEF నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం దక్షిణ భారతదేశంలోని మహారాష్ట్రలో 9.13 శాతం మంది మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)తో బాధపడుతున్నారు. అయితే 22.5 శాతం మందికి PCOD ఉంది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో PCOS పెరుగుతోంది. గణాంకాల ప్రకారం భారతదేశంలో 3.7% నుండి 22.5% (1.3 నుంచి 7.9 కోట్లు) మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 2019 నివేదిక ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరికి PCOD ఉంది. 20 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 116 మిలియన్ల మంది మహిళలు (3.4%) PCOS బారిన పడ్డారు.

వ్యాధి ఏ సమస్యలను కలిగిస్తుందంటే

కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి గర్భధారణలో ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వ్యాధి తీవ్రమైతే వంధ్యత్వానికి దారితీస్తుంది. ముఖంపై చాలా మొటిమలు కనిపిస్తాయి. అలాగే హార్మోన్ల ఉత్పత్తిలో తేడా వస్తుంది. దీని కారణంగా ముఖంపై అధిక జుట్టు పెరుగుతుంది. అధిక బరువు,  ఊబకాయంతో బాధపడుతున్న స్త్రీలు PCOS,  మధుమేహం టైప్ 2, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

భారతదేశంలో PCOD ఎందుకు పెరుగుతోంది?

గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఈ వ్యాధి చాలా వేగంగా పెరుగుతోంది. దీనికి మొదటి ప్రధాన కారణం ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడమే.. వాస్తవానికి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మహిళలకు ఈ వ్యాధి గురించి తెలియదు. నేటికీ మహిళలు పునరుత్పత్తి జీవితానికి సంబంధించిన వ్యాధులను ప్రస్తావించకుండా..  చికిత్స తీసుకుంటున్నారు.

మరోవైపు వైద్యుల ప్రకారం మారుతున్న ఆహారపు అలవాట్లు, సమయానికి ఆహారం తినకపోవడం, అస్తవ్యస్తమైన జీవనశైలి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ప్యాకేజ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం ఇందుకు కారణంగా మారుతోంది. అంతేకాకుండా వ్యాయామం చేయకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది. పిసిఒఎస్ అవేర్‌నెస్ నెలను సెప్టెంబర్ నెలలో జరుపుకుంటాం.

PCOD కి తీసుకోవాల్సిన చికిత్స

PCOD వ్యాధి ‘నివారణ’ లేదు. అయితే దీనిని నియంత్రించడమే ఉత్తమ మార్గం. కనుక స్త్రీలు తమ  జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం (తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్, ఫైబర్) తీసుకోవాలి. వ్యాయామం చేస్తూ బరువుని నియత్రించుకోవాలి. ఎందుకంటే బరువులో 5% తగ్గినా  కూడా PCODకి ఇచ్చే చికిత్సను సులభతరం చేస్తుంది. అంతేకాదు స్త్రీల హార్మోన్లను సమతుల్యం చేయడానికి మందులు ఇవ్వవచ్చు. PCOD కారణంగా మొటిమలు , జుట్టు రాలుతుంటే సాధారణంగా చర్మ చికిత్సను తీసుకుంటే సమస్య పరిష్కరించబడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..